International Award for RRR: ఆర్ఆర్ఆర్‌కు మరో అంతర్జాతీయ పురస్కారం.. బెస్ట్ ఇంటర్నేషనల్ చిత్రంగా గౌరవం
International Award for RRR: ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. 2022 అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ చిత్రంగా నిలిచింది. ఇప్పటికే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్.. రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందించింది.
International Award for RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ పురస్కారాలు కూడా రావడం మొదలైంది. ఇటీవలే న్యూజిలాండ్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC) రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందించగా.. తాజాగా ఆర్ఆర్ఆర్‌కు మరో అరుదైన పురస్కారం లభించింది. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్.. 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ అవార్డుకు ఎంపికచేసింది. ఈ విషయాన్ని సోమవారం నాడు సదరు జ్యూరీ ట్విటర్ వేదికగా తెలియజేసింది.
ఈ ట్వీట్‌పై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా రిప్లయి ఇచ్చారు. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్‌కు బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ పురస్కారం రావడం సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. ఈ అరుదైన గౌరవం రావడంతో అభిమానుల కూడా సోషల్ మీడియా వేదికగా విశేషంగా స్పందిస్తున్నారు.
గత వారం రాజమౌళికి న్యూయార్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్.. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో అవార్డును ప్రకటించింది. ఇంతలోనే మరో అరుదైన పురస్కారం రావడంతో ఆర్ఆర్ఆర్ బృందం ఫుల్ ఖుషీగా ఉంది. ఇప్పటికే ఆస్కార్ నామినేషన్ కూడా దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.
సంబంధిత కథనం
టాపిక్