Brahmamudi November 30th Episode: ఇంట్లో రాజ్ దొంగతనం- భర్తకు అపర్ణ విడాకులు- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ- స్వప్న వార్నింగ్
30 November 2024, 8:19 IST
- Brahmamudi Serial November 30th Episode: బ్రహ్మముడి నవంబర్ 30 ఎపిసోడ్‌లో డబ్బులిస్తా అన్న రాజ్‌ను ధులిపేసి పోతుంది కావ్య. ఇంట్లోకి నెలకు లక్ష రూపాయలకు కొత్త పనిమనిషి స్టెల్లాను తీసుకొస్తున్నట్లు రాజ్ చెబుతాడు. ఆకలికి ఆగని రాజ్ దొంగతనంగా కావ్య చేసిన వంట తింటాడు. అది ఇందిరాదేవి, సీతారామయ్య చూస్తారు.
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 30వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఫుడ్ తీసుకొచ్చినందుకు రాజ్ డబ్బులు ఇస్తాడు. దాంతో కావ్యకు కోపం వస్తుంది. ఒళ్లంతా పొగరు ఉంది మీకు. మీ తలతిక్క నిర్ణయాల వల్ల అత్తయ్య గారు మా ఇంటికి వచ్చారు. ఇంకా మీకు తెలిసిరాలేదా అని కావ్య అంటుంది. నీకు ఈ ఇంటికి సంబంధం లేనప్పుడు ఫుడ్ తీసుకురాకూడదు. తీసుకొచ్చినప్పుడు బిల్లు చెల్లించాల్సిందే అని రాజ్ అంటాడు.
ప్రతీది డబ్బుతో కొనలేరు
వాళ్లిద్దరు నాకు అమ్మమ్మ, తాతయ్యలు కాబట్టి తీసుకొచ్చాను అని కావ్య అంటుంది. వాళ్లు నీకు ఎటు నుంచి అమ్మమ్మ, తాతయ్యలు అయ్యారు అని రాజ్ అంటాడు. మా నుంచే. నా కొడుకుకి ఒక అడ్డగాడిద పుట్టాడు. అహకారం నిండిపోయి భార్యను పుట్టింట్లో వదిలేశాడు అని ఇందిరాదేవి అంటుంది. మా బంధుత్వం గురించి ప్రశ్నించే హక్కు మీకు లేదు. ప్రతీది డబ్బుతో కొనలేరు అని కావ్య అంటుంది. అవునురా సంతోషాన్ని, విశ్వసాన్ని, నిద్రను కొనలేవు అని ప్రకాశం అంటాడు.
కావ్య మా మనవరాలు. కాదంటానికి ఎవరికి హక్కు లేదు. అయినా నీ వల్ల ఆ పిల్ల ఏం సుఖపడిందని నిలబెట్టి అవమానిస్తున్నావ్ అని సీతారామయ్య అంటాడు. కావ్య ఇంటికి కాపురానికి వచ్చినప్పటినుంచి తనను సంతోషంగా ఉంచలేదు అని సుభాష్ అంటాడు. హా.. హా.. హా.. చిడతల బృందం భజన వాయిస్తోంది. ఈమె వల్ల మా వదిన ప్రాణాలకు తెచ్చుకుంది. ఆ కనకం ఏదో వండి పంపిస్తే కావ్య అన్నపూర్ణ అంశంతో పుట్టిన కారణజన్మురాలిలా కనిపిస్తుందా అని రుద్రాణి అంటుంది.
కరెక్ట్‌గా చెప్పావ్ అత్త. ఈ నాటకానికి పుల్ స్టాప్ పెట్టడానికి కొత్త పాత్రని ప్రవేశపెట్టనున్నాను అని రాజ్ అంటే.. ఏంటా పాత్ర. గుండు చెంబా.. మడత చెంబా అని ఇందిరాదేవి సెటైర్ వేస్తుంది. ఒక కొత్త పనిమనిషిని మాట్లాడాను. ఒక స్టార్ రెస్టారెంట్‌లో చెఫ్‌గా చేసింది. సుకుమారంగా.. ఉంటుంది. కమ్మగా వండిపెడుతుంది. అమ్మగా తినిపిస్తుంది. ఇక నాలాంటివాళ్లకు కొసరి కొసరి వడ్డిస్తుంది అని రాజ్ అంటాడు. అయితే నాకు కూడానా. ఇంతకీ ఆమె పేరు ఏంటీ అని రాహుల్ అడుగుతాడు.
కుక్కను తీసుకొస్తా అంటున్నారు
స్టెల్లా అని రాజ్ అంటాడు. చాలా స్టైలిష్‌గా ఉందని రాహుల్ అంటాడు. జీతం ఎంతని రుద్రాణి అడుగుతుంది. నెలకు లక్ష రూపాయలు అని రాజ్ అంటాడు. దుగ్గిరాల ఇంటి పనిమనిషి అంటే ఆమాత్రం ఉండాలి. అయితే అన్ని వంటలు చేయించుకోవచ్చు అని రుద్రాణి అంటుంది. ఇక మీరందరూ గ్రూప్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఆయన కుక్కను తీసుకొస్తానంటున్నారు. కరిస్తే ప్రాణాలకు ప్రమాదం. సారీ సారీ కుక్ కదు అని కావ్య వెటకారంగా అంటుంది.
నువ్ వండిన వంటలు ఆమె కాలి గోటికి సరిపోవు అని రాజ్ అంటాడు. వీడికి మతిస్థిమితం తప్పినట్లుంది. నువ్వేం పట్టించుకోకు. రేపు కూడా మాకు తీసుకురా అని ఇందిరాదేవి అంటుంది. నానమ్మా ఆ అవసరం లేదని రాజ్ అంటే.. మాకు అవసరం ఉంది. నువ్ నోరుమూసుకుని పో. అదెవరో రాని దాని సుకుమారమేంటో, వయ్యారమేంటో, తిప్పుకోవడం ఏంటో అన్ని తేలుస్తా అని ఇందిరాదేవి అంటుంది. ఇక కావ్య వెళ్తుంది. మరోవైపు అప్పు, కల్యాణ్ భోజనం చేస్తుంటారు.
ఈరోజు నిన్నెందుకో కన్నార్పకుండా చూడాలని ఉంది. నన్ను నమ్మినందుకు. నాతో వచ్చినందుకు. ప్రేమను నమ్మాలని ఈరోజు నాకు తెలిసింది. పైకి కఠినంగా ఉండే నువ్వు ఎంత సున్నితంగా ఉంటావో తెలిసింది. అనామికతో మాట్లాడిన దాంతో నాపై ఉన్న ప్రేమను చూపించావ్. నిన్ను ప్రేమించడం నా అదృష్టం. అనామిక మాటలకు నాపై ఎక్కడో అనుమానం ఉండేది. కానీ, నువ్వే ఎక్కువ నమ్మావు. నేను ఏం సాధించకుండానే నా గెలుపును ఎప్పుడో ఊహించేశావ్. అంత నమ్మకం ఏంటీ పొట్టి అని కల్యాణ్ అంటాడు.
కావ్య గురించి
మనల్నీ మనం నమ్మితేనే కదా అనుకున్నది సాధించగలం. సక్సెస్ అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరు ఎక్కువ టాలెంట్ చూపిస్తారో, ఎవరు ఎక్కువ నమ్మకంగా ఉంటారో వాళ్లకు సక్సెస్ వస్తుంది అని అప్పు అంటుంది. నేను నీకు నచ్చినట్లు లేనందుకు నీకెప్పుడు కోపం రాలేదా అని కల్యాణ్ అంటాడు. ఎందుకు రావాలి. ఇది జీవితం. ఎవరి ఇష్టాలను వాళ్లం గౌరవించాం ఇంకెందుకు కోపం అని అప్పు అంటుంది. మరోవైపు కావ్య ఇంటికి రావడం గురించి రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటారు.
ఇలాగే వదిలేస్తే కావ్య పర్మనెంట్‌గా ఇంట్లో ఉండిపోతుందని రుద్రాణి అంటే.. రాజ్ ఎవరో అమ్మాయిని చూశాను అన్నాడు కదా. ఆమె సెట్ అయితే కావ్య వచ్చే అవకాశం ఉండదు కదా అని రాహుల్ అంటాడు. కావ్య ఇలా వస్తుందని ఊహించావా. పనిమనిషి వచ్చినకూడా రాదని గ్యారెంటీ అని రుద్రాణి అంటుంది. ఇంతలో స్వప్న ఎంట్రీ ఇస్తుంది. మీరు ఊహించింది నిజమే ఆంటీ. కావ్య ఈ ఇంటికి కచ్చితంగా వస్తుంది. ఇక్కడే ఉంటుంది అని స్వప్న అంటుంది.
మీరు కావ్య రావడంపై ఎందుకు భయపడుతున్నారో తెలుసు ఆంటీ. కావ్య వస్తే ఆస్తి పంపకాలు జరగవనే కదా. కావ్య రాకూడదని కోరుకుంటున్నారు అని స్వప్న అంటుంది. మేము అనుకుంటున్నాం అంతే. రాజ్ రాకుండా అడ్డుకుంటాడు. దానిసంగతి ఏంటీ. నాకు రాజ్‌పై మరింత నమ్మకం ఉంది అని రుద్రాణి అంటుంది. కావ్య మొండిది. అనుకుంది సాధించే వరకు ఊరుకోదు. కాలేజ్‌లో నా చేయి పట్టుకున్నాడని లెక్చరర్‌ను సస్పెండ్ చేసేవరకు గ్రౌండ్‌లో వారం రోజులు కూర్చుంది. ఇక తన కాపురాన్ని ఎలా వదులుకుంటుంది అని స్వప్న అంటుంది.
దొంగతనంగా రాజ్
తర్వాత ఇందిరాదేవి, సీతారామయ్య భోజనం చేస్తుంటారు. కావ్య నీకోసం కూడా వండింది తినమని అంటారు. తినను అని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ తెచ్చుకున్న పిజ్జా బాగుండదు. దాంతో ఆకలితో అలమటిస్తుంటాడు రాజ్. తర్వాత రాజ్ కిందకు వచ్చి తినాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు. ఇక ఆకలికి తట్టుకోలేక, ఎవరైన ఉన్నారా లేరా అని దొంగలా అటు ఇటు చూసి అన్నం పెట్టుకుని తింటాడు రాజ్. ఆకలితో చాలా ఫాస్ట్‌గా తినేసరికి రాజ్‌కు పొలమారుతుంది.
దాంతో ఇందిరాదేవి, సీతారామయ్య వచ్చి నీళ్లు ఇస్తారు. అది చూసి రాజ్ అవమానంగా ఫీల్ అవుతాడు. బాగా ఆకలేసింది. నేను తెచ్చుకున్న ఫుడ్ పాడైపోయింది అని రాజ్ అంటాడు. తిను నాన్న. కావ్య వండినా మనింట్లోనే కదా. తిను అని ఇందిరాదేవి అంటుంది. తినబోయి మళ్లీ ఆగిపోతాడు రాజ్. కావ్యకు తెలిస్తే చులకన అయిపోతాను అని రాజ్ అంటాడు. భర్త ఆకలి తీరుతో ఏ భార్య అయినా సంతోషంగానే అనుకుంటుందిరా. అయినా మేము కావ్యకు చెప్పంలే అని సీతారామయ్య అంటాడు.
నీకెందుకు ఈ కర్మ. కావ్యను భార్యగా అంగీకరించి తీసుకొస్తే దర్జాగా ఉండొచ్చు కదా. నీకోసం ఈ వంటలన్ని తెచ్చు మాకోసం అని చెప్పిందిరా కావ్య అని ఇందిరాదేవి అంటుంది. ఆ నాటకాలన్ని మీరు నమ్మండి నేను నమ్మను. మీ కోసం తన మెడలో తాళి కట్టాను. మరోసారి ఆ తప్పు చేయను. రేపు నేను అపాయింట్ చేసిన చెఫ్ వస్తే ఇలా తినాల్సిన అవసరం లేదని రాజ్ వెళ్లిపోతాడు. వీడి పంతం ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావట్లేదని సీతారామయ్య అంటాడు.
దొంగతనం బయటపడుతుందనా
కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరితో కావ్య చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. మెట్లపైన కింద కూర్చుని కావ్యను చూస్తాడు. అది చూసి ఇందిరాదేవికి చెబుతుంది కావ్య. ఏరా అలా దొంగతనంగా మా మాటలు వినాల్సిన ఆ ఖర్మ ఏంట్రా. వచ్చి మాతో కూర్చోవచ్చు అని ఇందిరాదేవి అంటుంది. నేనేం దొంగలా వినట్లేదు. అలా ఊరికే కూర్చున్నాను అని రాజ్ అంటాడు.
రాత్రి చేసిన దొంగతనం బయటపడుతుందనా.. లేకపోతే ఇంకా ఆ దొంగబుద్ధి పోలేదా అని సీతారామయ్య అంటాడు. తాతయ్య ఏం దొంగనతం చేశారు అని కావ్య అడుగుతుంది. నాన్సెన్స్ నా ఇంట్లో నేను దొంగతనం చేయడం ఏంటీ. పాల ప్యాకెట్ల కంటే ముందు వచ్చావేంటీ అని రాజ్ అంటాడు. నేను తాతయ్య వాళ్ల కోసం వచ్చానని కావ్య అంటుంది. నీ వల్ల అపర్ణ వెళ్లిపోయింది. స్వప్న కడుపుతో ఉంది చేయలేదు. రుద్రాణి బ్యూటి పార్లర్‌కు వెళ్లింది. ఉన్న వండదు. మీ పిన్ని వేరు కుంపటి పెట్టింది. ఇలాంటప్పుడు మాకోసం వచ్చినవాళ్లను అంటే ఊరుకోమని సుభాష్ అంటాడు.
ఇది నా ఇల్లు నాకు కావాల్సిన వాళ్లు ఎప్పుడైనా వస్తారు అని సీతారామయ్య అంటాడు. రాజ్ ఇంతకీ నువ్ చెప్పిన స్టెల్లా ఇంకా రాలేదు అని రాహుల్ అంటాడు. త్వరలో వస్తుంది అని రాజ్ అంటాడు. అవునా అని రాహుల్ సంతోషిస్తే ఏంటా ఆత్రుత వంట కోసమా. వంట మనిషి కోసమా అని స్వప్న అంటుంది. ఇంతవరకు టిఫిన్ కూడా లేదు అని రాహుల్ అంటాడు. నా పెళ్లానికి బుద్ధి చెప్పడానికి ఇదే మంచి టైమ్ అని ప్రకాశం అనుకుంటాడు.
పనిమనిషి స్టెల్లా ఎంట్రీ
ఏదిరా ఇంకా రాలేదు అని స్టెల్లా గురించి ఆతృతగా అడుగుతాడు ప్రకాశం. ఏంటీ మిమ్మల్ని చూస్తుంటే హారతి పట్టేలా ఉన్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా గురించి నీకెందుకే అని ప్రకాశం అంటాడు. ఇంతలో పనిమనిషి స్టెల్లా కారులో వస్తుంది. ఆమెను చూసి అంతా షాక్ అవుతారు. రాహుల్ చొంగకార్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే సుభాష్‌కు విడాకులు ఇస్తున్నట్లు నోటీసులు పంపిస్తుంది అపర్ణ. ఆ నోటీసులు రాజ్ చదువుతాడు.
సుభాష్‌కు అపర్ణ విడాకులు ఇస్తున్నట్లు రాజ్ చెబుతాడు. అత్తయ్య మావయ్యకు విడాకులు ఇవ్వడం ఏంటీ అని కావ్య అంటుంది. దాంతో షటప్ అని రాజ్ కోప్పడతాడు. మీ ఇంట్లో అంతా కలిసి మా మమ్మీకి ఏం నూరిపోశారు అని రాజ్ అంటాడు. ఎవరికోసం నాకు అవసరం లేదు. నాకు నా భార్య ముఖ్యం అని సుభాష్ అంటాడు. రేపటికల్లా అమ్మను తీసుకొచ్చే బాధ్యత నాది అని రాజ్ అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్