తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్.. 3 నెలల్లో యానిమల్ కంటెస్టెంట్ ఎంత సంపాదించాడంటే?

Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్.. 3 నెలల్లో యానిమల్ కంటెస్టెంట్ ఎంత సంపాదించాడంటే?

Sanjiv Kumar HT Telugu

02 December 2024, 5:30 IST

google News
    • Bigg Boss Telugu 8 Prithviraj Shetty Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో టేస్టీ తేజ, పృథ్వీరాజ్ శెట్టి ఇద్దరూ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడారు. స్టాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో ఉన్న 3 నెలలకు గానూ ఎంత పారితోషికం తీసుకున్నాడో చూద్దాం.
బిగ్ బాస్ నుంచి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్.. 3 నెలల్లో యానిమల్ కంటెస్టెంట్ ఎంత సంపాదించాడంటే?
బిగ్ బాస్ నుంచి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్.. 3 నెలల్లో యానిమల్ కంటెస్టెంట్ ఎంత సంపాదించాడంటే?

బిగ్ బాస్ నుంచి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్.. 3 నెలల్లో యానిమల్ కంటెస్టెంట్ ఎంత సంపాదించాడంటే?

Bigg Boss 8 Telugu Prithviraj Shetty Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌ తుది ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ 8 తెలుగు ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో 13వ వారం డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం టేస్టీ తేజ, పృథ్వీరాజ్ శెట్టి ఇద్దరూ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడారు.

టేస్టీ తేజ-పృథ్వీరాజ్ ఎలిమినేట్

బిగ్ బాస్ 8 తెలుగు పదమూడో వారం నామినేషన్స్‌లో 8 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. దాంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తిగా మారింది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 30 ఎపిసోడ్‌లో మొదటగా టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 1 ఎపిసోడ్‌లో పృథ్వీరాజ్ శెట్టి ఎవిక్ట్ అయి వెళ్లిపోయాడు.

టేస్టీ తేజ రెమ్యునరేషన్

అయితే పృథ్వీకంటే ముందుగా ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ తెలుగు 8 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ టేస్టీ తేజ 2 నెలలకు గానూ రూ. 12 లక్షలు లేదా రూ. 32 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, పృథ్వీ కంటే టేస్టీ తేజ రెమ్యునరేషన్ (వారానికి రూ. 1,50,000/రూ. 4 లక్షలు) ఎక్కువ అని తెలుస్తోంది.

యానిమల్ పోస్టర్‌తో

ఇక బిగ్ బాస్ హౌజ్‌లో యారగంట్‌గా, రౌడీలా బిహేవ్ చేసిన పృథ్వీరాజ్‌కు ఆదివారం నాటి ఎపిసోడ్‌లో యానిమల్ సినిమా పోస్టర్ ఇచ్చి డెడికేట్ చేశారు. రోహిణికి అరుంధతి, గౌతమ్‌కు ఏక్ నిరంజన్, ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్‌కు మన ఫ్యామిలీ, విష్ణుప్రియ-పృథ్వీకి కలిపి నిన్ను కోరి మూవీ పోస్టర్స్ ఇచ్చి వారి క్యారెక్టర్ అంటూ డెడికేట్ చేశారు.

11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ

అనంతరం రెండో సారి ఎలిమినేషన్ ప్రక్రియ పృథ్వీ వర్సెస్ విష్ణుప్రియ మధ్య జరిగింది. వారిలో విష్ణుప్రియ సేవ్ కాగా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 8కు పృథ్వీరాజ్ తీసుకున్న రెమ్మునరేషన్ ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ 2న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి 11వ కంటెస్టెంట్‌గా పృథ్వీ, పన్నెండో సభ్యురాలిగా విష్ణుప్రియ కలిసి బడ్డీగా వచ్చారు.

వారానికి రూ. లక్షా 30 వేలు

బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగుపెట్టిన పృథ్వీరాజ్ హౌజ్‌లో దాదాపుగా 91 రోజులు ఉన్నాడు. అంటే, సరిగ్గా 3 నెలల (13 వారాలు) వరకు హౌజ్‌లో అలరించాడు. బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొన్నందుకు పృథ్వీ రోజుకు రూ. 18,572 పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అంటే, వారానికి రూ. లక్షా 30 వేలు. ఈ లెక్కన 13 వారాలకు పృథ్వీరాజ్ సుమారుగా రూ. 16 లక్షల 90 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది.

3 నెలల్లో సంపాదించింది

అయితే, టేస్టీ తేజ లాగే పృథ్వీ బిగ్ బాస్ రెమ్యునరేషన్ రెండు రకాలుగా వినిపిస్తోంది. పృథ్వీ వారానికి రూ. 1,50,000 పారితోషికం అందుకున్నట్లు మరో టాక్. ఈ లెక్కన 13 వారాలకు పృథ్వీరాజ్ శెట్టి రూ. 19.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అన్ని జీఎస్‌టీలు కలుపుకుని యానిమల్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ శెట్టి 3 నెలలకు బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా రూ. 19,50,000 డబ్బు సంపాదించినట్లు సమాచారం.

తదుపరి వ్యాసం