Bigg Boss 7 Remunerations : బిగ్ బాస్ రెమ్యునరేషన్స్ ఇవే.. ఎక్కువ పారితోషికం ఎవరికంటే?
Bigg Boss 7 Remunerations : బిగ్ బాస్ సీజన్ 7 మెుదలైంది. మెుదటి రోజు పూర్తయింది. కొంచెం రచ్చ కూడా మెుదలైంది. అయితే తాజాగా కంటెస్టెంట్లకు సంబంధించిన రెమ్యునరేషన్స్ వివరాలు వైరల్‍గా మారాయి.
అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో నడుస్తోంది. మెుదటి రోజు నామినేషన్స్ గొడవ పెట్టేశాడు బిగ్ బాస్. చిన్న గొడవలు, పులిహోర కలపడాలు మెుదలయ్యాయి. ఎలాగైనా నేనే గెలవాలనే కంటెస్టెంట్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి సీజన్‍లో పెద్దగా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు అయితే కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ విషయం గురించి ఇప్పుడు బాగా చర్చ నడుస్తోంది. చాలా తక్కువ మెుత్తంలో షో ఒప్పుకున్నారని కామెంట్స్ వస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 7 మొదటి కంటెస్టెంట్ అయిన టెలివిజన్ నటి ప్రియాంక జైన్ వారానికి దాదాపు రూ. 2.5 లక్షల పారితోషికం పొందుతోంది. సింగర్ దామిని భట్ల రూ.2 లక్షలు అందుకుంటుంది. అంతగా పాపులర్ కాని నటి రతికా వారానికి రూ. 2 లక్షలు తీసుకుంటుంది.
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో పాల్గొన్నందుకు శోభా శెట్టికి వారానికి రూ. 2.5 లక్షల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. నటి కిరణ్ రాథోడ్ రూ.3 లక్షలు తీసుకుంటుంది. పాపులర్ రైతు బిడ్డా, పల్లవి ప్రశాంత్ రూ. 1 లక్ష రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. యూట్యూబర్, హాస్యనటుడు టేస్టీ తేజకు వారానికి రూ. 1.5 లక్షలు ఇస్తున్నారు.
నటి శుభాశ్రీకి రూ. 2 లక్షలు, గౌతం కృష్ణకు వారానికి దాదాపు రూ. 1.75 లక్షలు, ప్రిన్స్ యావర్‍కు వారానికి రూ. 1.5 లక్షల చెల్లిస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ 2.75 లక్షల రెమ్యునరేషన్‌తో షోను అంగీకరించాడు. నటి షకీలాకు రూ.3.5 లక్షలు, అమర్‌దీప్‌కు రూ.2.5 లక్షలు ఇస్తున్నారు. నటుడు శివాజీకి బిగ్ బాస్ నుంచి వారానికి రూ. 4 లక్షలు పొందుతున్నాడు. అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్‍గా ప్రస్తుతం అతడే ఉన్నాడు. తక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు.
మెుదట్లో 35 లక్షలు రూపాయల ఆఫర్ ఇచ్చినా.. వెళ్లకుండా ఇక్కడే ఉంటామని కంటెస్టెంట్లు చెప్పారు. గెలుస్తారో లేదో కదా.. తీసుకోవాల్సింది అని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెమ్యునరేషన్ కంటే షోలో వచ్చే ఫేమ్ కోసం కంటెస్టెంట్లు చూస్తుంటారు. మెుత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు వైరల్‍గా మారాయి.