తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Man Season 3 | ఫ్యామిలీ మ్యాన్​ సీజన్​ 3 వచ్చేస్తోంది..!

Family Man season 3 | ఫ్యామిలీ మ్యాన్​ సీజన్​ 3 వచ్చేస్తోంది..!

HT Telugu Desk HT Telugu

29 April 2022, 8:33 IST

    • ది ఫ్యామిలీ మ్యాన్​ న్యూ సీజన్​ అంటూ అమెజాన్​ ప్రైమ్​ వీడియో.. ఇన్​స్టాగ్రామ్​లో కొత్త పోస్ట్​ పెట్టింది. వెబ్​సిరీస్​ అభిమానులు ఫుల్​ ఖుషీలో ఉన్నారు.
ఫ్యామిలీ మ్యాన్​ కొత్త సీజన్​
ఫ్యామిలీ మ్యాన్​ కొత్త సీజన్​ (Amazon prime/ instagram)

ఫ్యామిలీ మ్యాన్​ కొత్త సీజన్​

Family Man season 3 | 'ది ఫ్యామిలీ మ్యాన్'​.. అమెజాన్​ ప్రైమ్​ వీడియోలోని ఈ వెబ్​ సిరీస్​కు నెక్స్ట్​ లెవెల్​ ఫ్యాన్​ బేస్​ ఉంది! ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లు దుమ్మురేపాయి. తాజాగా.. ఫ్యామిలీ మ్యాన్​ సీజన్​ 3 గురించి ఓ వార్త బయటకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

'ది ఫ్యామిలీ మ్యాన్​ న్యూ సీజన్​' అంటూ ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో అమెజాన్​ ప్రైమ్​ వీడియో చేసిన పోస్ట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. 'చెల్లం సర్​కి కాల్​ చెయ్​.. ఈ వార్త నిజమేనని ఆయన చెబుతారు,' అంటూ ఇంగ్లీష్​లో క్యాప్షన్​ ఇచ్చింది. దీంతో ఈ వెబ్​ సిరీస్​ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

అయితే.. సీజన్​ 3 రిలీజ్​ ఎప్పుడు ఉంటుంది? ఇందులో కనిపించే నటుల వివరాల గురించి ఆ పోస్ట్​లో ఏం లేదు. ఆ వివరాల కోసం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

ఓ సాధారణ ఫ్యామిలీ మ్యాన్​గా ఉంటూనే.. క్రైమ్​ను ఛేజ్​ చేసే వ్యక్తిగా మనోజ్​ బాజ్​పేయి నటన అందరిని ఆకట్టుకుంది. స్టోరీ హైలైట్​గా ఉండటంతో రెండు సీజన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా రెండో సీజన్​లో నటించిన ప్రముఖ నటి సమంతకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు దక్కింది.

వాస్తవానికి.. సీజన్​ 2 ముగింపులోనే సీజన్​​ 3 సంకేతాలిచ్చింది వెబ్​ సిరీస్​ బృందం. తొలి సీజన్​ ఉగ్రవాదం ఆధారంగా, రెండో సీజన్​ శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల కథల ఆధారంగా తెరకెక్కాయి. ఇక మూడో సీజన్.. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్​ ఆధారంగా ఉండనుందని తెలుస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.