naga chaitanya |నాగచైతన్య దూత వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్…
29 April 2022, 5:34 IST
నాగచైతన్య నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదలచేశారు. ఈ సిరీస్‌కు దూత అనే పేరును ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో నాగచైతన్య ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు
నాగచైతన్య
నాగచైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కానుంది.నాగచైతన్య ఈ సిరీస్ తోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అరంగేట్రం చేస్తుండటంతో ఇందులో ఆయన పాత్ర ఏ విధంగా ఉండనుంది? లుక్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.
గురువారం జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో ఈ సిరీస్ టైటిల్‌తో పాటు నాగచైతన్య లుక్‌ను విడుదలచేశారు. ఈ సిరీస్‌కు దూత అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్‌లో పాతకాలం నాటి కళ్లద్దాలు ధరించి సీరియస్ లుక్‌లో నాగచైతన్య కనిపిస్తున్నారు. సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ గా ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ఇప్పటివరకు కనిపించనటువంటి సరికొత్త పాత్రను నాగచైతన్య పోషిస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఇందులో చైతన్య ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అతీంద్రియ శక్తులతో అమాయకుల జీవితాల్ని నాశనం చేసే వారిని ఎదుర్కొనే యువకుడిగా పవర్‌ఫుల్ గా అతడి పాత్ర సాగుతుందని సమాచారం.
జాతీయ అవార్డు గ్రహీత,బెంగళూరు డేస్,చార్లీ వంటి మలయాళ సినిమాలతో ప్రతిభను చాటుకున్న కథానాయిక పార్వతి ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తోంది. ఆమెతో పాటు తమిళ నాయిక ప్రియాభవానీ శంకర్ మరో లీడ్ రోల్‌లో కనిపించబోతున్నది. పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌భాస్కర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. విక్రమ్ కె కుమార్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోంది. మార్చిలో ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.
టాపిక్