Naga Chaitanya |నాగచైతన్య తొలి వెబ్‌సిరీస్ ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే...
28 April 2022, 14:14 IST
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్‌సిరీస్‌తో నాగచైతన్య డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హారర్ కథాంశంతో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సంస్థ సొంతం చేసుకున్నదంటే...
నాగచైతన్య
నాగచైతన్య ఈ ఏడాది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ కథాంశంతో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. మార్చిలో ఈ వెబ్‌సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నాగచైతన్య కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వెబ్‌సిరీస్‌కు దూత అనే పేరును ఖరారు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దాదాపు ఎనిమిది నుంచి పది ఎపిసోడ్లుగా ఈ సినిమా సిరీస్ తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారీ మొత్తానికి ఈ డీల్ కుదిరినట్లు చెబుతున్నారు. ఆగస్ట్‌లో ఈ సిరీస్ రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ఈ సిరీస్‌లో నాగచైతన్యకు జోడీగా తమిళ నాయిక ప్రియాభవానీ శంకర్ నటిస్తోంది. కెరీర్‌లో నాగచైతన్య అంగీకరించి తొలి హారర్ కథాంశమిదే కావడం గమనార్హం.
టాపిక్