తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju | బిగ్ బాస్ విన్న‌ర్ తో దిల్‌రాజు వెబ్‌సిరీస్‌

Dil Raju | బిగ్ బాస్ విన్న‌ర్ తో దిల్‌రాజు వెబ్‌సిరీస్‌

HT Telugu Desk HT Telugu

25 April 2022, 14:06 IST

  • టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు ఏటీఎమ్‌తో పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో బిగ్‌బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా న‌టిస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ వెబ్ సిరీస్ మొదలైంది. 

ఏటీఎమ్‌ వెబ్ సిరీస్
ఏటీఎమ్‌ వెబ్ సిరీస్ (twitter)

ఏటీఎమ్‌ వెబ్ సిరీస్

తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్ రాజు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తూ తొలి ప్రయత్నంగా ఏటీఎమ్(ఎనీ టైమ్ మెమోరీ) పేరుతో ఓ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

దిల్ రాజు ప్రొడక్షన్స్,జీ5 సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు చంద్రమోహన్ దర్శకత్వ వహిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి దిల్ రాజు వార‌సులు హర్షిత్,హన్షిత ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ వెబ్ సిరీస్ ను లాంఛనంగా ప్రారంభించారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ నిచ్చారు.

ఈ సిరీస్ లో బిగ్‌బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ వీజే స‌న్నీహీరోగా నటిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ దివి కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు హ‌రీష్ శంక‌ర్ క‌థ‌ను అందిస్తున్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన భారీ ఏటీఎమ్ దోపిడీ సంఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకొని ఈ సిరీస్ ను రూపొందిస్తున్నట్లు స‌మాచారం. ఈ నెల 27 నుంచి ఈ వెబ్‌సిరీస్ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. ఈ వెబ్ సిరీస్‌కు ప్ర‌శాంత్ విహారి సంగీతాన్ని అందిస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం