తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies This Week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

18 May 2024, 20:59 IST

google News
    • OTT Telugu Movies This week: ఓటీటీలోకి ఈవారం మూడు తెలుగు సినిమాలు అడుగుపెట్టాయి. మరో రెండు చిత్రాలు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చాయి. ఆ సినిమాలు ఏవో.. ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయో ఇక్కడ చూడండి.
OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీలోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..
OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీలోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీలోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

OTT Telugu Movies This Week: ఈ వారం ఓటీటీలో ఓ తెలుగు సినిమా సడెన్‍గా అడుగుపెట్టి సర్‌ప్రైజ్ ఇచ్చింది. సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చి ఆశ్చర్యపరిచింది. అలాగే, ఈ వారం మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. రెండు బాలీవుడ్ చిత్రాలు తెలుగు డబ్బింగ్‍లో ఈ వారమే అడుగుపెట్టాయి. ఈ వారం (మే మూడో వారం) తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు ఏవంటే..

కృష్ణమ్మ

టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన కృష్ణమ్మ సినిమా మే 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్లను మాత్రం బాగానే రాబట్టింది. విజయవాడ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యదేవ్‍‍తో పాటు మీసాల లక్ష్మణ్, కృష్ణ బురుగుల ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు. దీంతో మంచి హైప్ ఏర్పడింది. కృష్ణమ్మ సినిమా వారంలో సుమారు రూ.5.40కోట్లను దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

కృష్ణమ్మ సినిమా మే 17వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన వారానికి ఓటీటీలోకి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చింది. డిస్ట్రిబ్యూటర్లకు ఎన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోవడం, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణమ్మ సినిమాను ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయండి.

షరతులు వర్తిస్తాయి

షరతులు వర్తిస్తాయి సినిమా నేడు (మే 18) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. చైతన్య రావ్, భూమి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 15వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి కుమార స్వామి దర్శకత్వం వహించగా… అరుణ్ చిలువేరు సంగీతం ఇచ్చారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. షరతులు వర్తిస్తాయి ఈ చిత్రాన్ని ఇక ఆహాలో వీక్షించవచ్చు.

విద్యావాసుల అహం

విద్యావాసుల అహం సినిమా మే 17వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఈ మూవీ ఆహా ఓటీటీలో అడుగుపెట్టేసింది. కొత్తగా వివాహం చేసుకున్న నవ దంపతులు ఆధిపత్యం కోసం ఈగోలతో ప్రయత్నాలు చేయడం చుట్టు కామెడీ ఫ్యామిలీ డ్రామాగా విద్యావాసుల అహం మూవీని దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కించారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్ స్వరాలు సమకూర్చారు.

డబ్బింగ్‍లో రెండు..

ఈ వారం రెండు బాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చాయి. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘జర హట్కే జర బచ్కే’ మూవీ మే 17న జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన పదకొండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. తెలుగు డబ్బింగ్‍లోనూ ఈ చిత్రం జియోసినిమాలో స్ట్రీమ్ అవుతోంది.

బస్తర్ ది నక్సల్ స్టోరీ మూవీ మే 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ఈ హిందీ సినిమా తెలుగు ఆడియోలోనూ అందుబాటులోకి వచ్చింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 15న విడుదలైంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు జీ5 ఓటీటీలో చూసేయవచ్చు.

బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ వెబ్ సిరీస్ మే 17న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

తదుపరి వ్యాసం