Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..-bastar the naxal story ott release date out adah sharma political thriller will stream on zee5 platform from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bastar The Naxal Story Ott: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
May 08, 2024 02:14 PM IST

Bastar: The Naxal Story OTT Release Date: బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఆ వివరాలివే..

Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..
Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

Bastar: The Naxal Story OTT: అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా వివాదాస్పదమైంది. సుదీప్తో సేన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో వీరి కాంబినేషన్‍లో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ వివాదం కావటంతో పాటు బ్లాక్‍బస్టర్ అయింది. అయితే, ‘బస్టర్: ది నక్సల్ స్టోరీ’ విషయంలో అది రిపీట్ కాలేదు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది.

స్ట్రీమింగ్ డేట్

బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీ మే 17న తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నేడు (మే 8) సోషల్ మీడియాలో జీ5 అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు తెలుగులోనూ మే 17న ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుందని వెల్లడించింది.

“సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, భీకర ఫైటర్ ఐపీఎస్ నీరజా మాధవన్ (అదా శర్మ).. నక్సలిజాన్ని అరికట్టేందుకు వస్తున్నారు. మే 17న బస్తర్ జీ5లో హిందీ, తెలుగులో ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో పోలీస్ అఫీసర్ నీరజా మాధవన్‍గా అదా శర్మ నటించారు.

బస్తర్ ది నక్సల్ స్టోరీ మూవీని దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. సుదీప్తోతో పాటు అమర్‌నాథ్ జా, విపుల్ అమృత్ లాల్ షా ఈ మూవీకి కథ రాశారు. సన్‍షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు.

బస్తర్ మూవీలో అదా శర్మతో పాటు ఇందిరా తివారీ, నమన్ జైన్, రైమా సేన్, యశ్‍పాల్ శర్మ కీలకపాత్రుల చేశారు. విశాఖ్ జ్యోతి సంగీతం అందించిన ఈ మూవీకి రాహుల్ ధారుమన్ సినిమాటోగ్రఫీ చేశారు.

స్టోరీ లైన్ ఇదే

నక్సలైట్ల దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడం.. ఆ తర్వాత నక్సలైట్లను అడ్డుకునేందుకు ఐపీఎస్ నీరజా మాధవన్ (అదా శర్మ) రంగంలోకి దిగడం చుట్టూ బస్తర్ మూవీ స్టోరీ సాగుతుంది. నక్సలైట్ల కార్యాకలాపాలు, దాడుల గురించి ఈ మూవీలో మేకర్స్ చూపించారు. అలాగే, నక్సలైట్లతో నీరజా ఎలా పోరాడారన్న విషయాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రానికి ఆరంభం నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. అదా శర్మ నటన, యాక్షన్‍కు ప్రశంసలు వచ్చినా.. మిగిలిన విషయాల్లో మిశ్రమ స్పందనను ఈ చిత్రం దక్కించుకుంది. మొత్తంగా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్

జీ5 ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తలైమై సేయలగం వస్తోంది. మే 17వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. కిశోర్, శ్రీయారెడ్డి, భరత్, రమ్య నంబీషన్, ఆదిత్య మీనన్ ఈ సిరీస్‍లో ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‍కు దర్శకుడు వసంతబాలన్ దర్శకత్వం వహించారు. రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై రాధికా శరత్ కుమార్, శరత్ కుమార్ ప్రొడ్యూజ్ చేశారు. తలైమై సేయలగం సిరీస్‍ను మే 17 నుంచి జీ5 ఓటీటీలో చూడొచ్చు.

IPL_Entry_Point