Vidya Vasula Aham OTT: నేరుగా ఓటీటీలోకి విద్యా వాసుల అహం సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
Vidya Vasula Aham OTT Release Date: విద్యావాసుల అహం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతోంది. రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ అయింది. ఆ వివరాలివే..
Vidya Vasula Aham OTT: ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి నేరుగా మరో సినిమా వస్తోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే ‘విద్యావాసుల అహం’ మూవీ ఆ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీలో కోటబొమ్మాళి పీఎస్ ఫేమ్ రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కించారు. ఈ ‘విద్యావాసుల అహం’ సినిమా స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది.
ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
విద్యావాసుల అహం మూవీ మే 17వ తేదీన ఆహా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (మే 12) ప్రకటించింది. “అహంతో కూడిన ప్రేమ కథ చెప్పడానికి మే 17వ తేదీన విద్యా, వాసు వస్తున్నారు! లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ.. విద్యావాసుల అహం చిత్రానికి రెడీ అవండి” అని ఆహా ఓటీటీ ట్వీట్ చేసింది.
స్టోరీ లైన్
కొత్తగా పెళ్లయిన వాసు (రాహుల్ విజయ్), విద్య (శివానీ రాజశేఖర్) అహంతో ఒకరిపై ఒకరి పైచేయి సాధించాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ప్రతీ విషయంలో ఒకరిపై ఒకరు గెలువాలని, డామినేట్ చేయాలని పట్టుదలగా ఉంటారు. మరి ఈగో వారి బంధంపై ఎలాంటి ప్రభావం చూపింది.. కలిసే ఉంటారా అనేది విద్యా వాసుల అహం మూవీలో చూడాలి. ఈ మూవీలో కామెడీ, ఫ్యామిలీ డ్రామా ప్రధానంగా ఉండనుంది. కోట బొమ్మాళి పీఎస్ తర్వాత రాహుల్, శివానీ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది.
విద్యా వాసుల అహం చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, అభినయ, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ, శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి కీరోల్స్ చేశారు. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎటర్నెటీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై లక్ష్మి నవ్య, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్టా నిర్మించారు. కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
విద్యా వాసుల అహం మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని ముందుగా మేకర్స్ భావించారు. గతేడాది డిసెంబర్‌లోనే టీజర్ తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు ప్లాన్ మార్చుకున్నారు. నేరుగా ఆహా ఓటీటీలోనే ఈ చిత్రం వస్తోంది. మే 17న ఈ మూవీ స్ట్రీమింగ్ ఆహాలో మొదలుకానుంది.
ఆహాలో లేటెస్ట్ రిలీజ్‍లు
ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈనెలలోనే ‘సిద్ధార్థ్ రాయ్’, ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. మే 3వ తేదీన సిద్ధార్థ్ రాయ్ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. యశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న రిలీజై.. బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ మూవీ ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం ఆహా ఓటీటీలో మే 8వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అంజలి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ థియేటర్లలో ఏప్రిల్ 11న రిలీజ్ కాగా.. మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.