తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aidpurush Box Office : ఆదిపురుష్ తొలిరోజు 100 కోట్లు వసూలు చేస్తుందా?

Aidpurush Box Office : ఆదిపురుష్ తొలిరోజు 100 కోట్లు వసూలు చేస్తుందా?

Anand Sai HT Telugu

01 June 2023, 6:05 IST

    • Box Office Prediction : ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్నారు. అయితే మెుదటి రోజు కలెక్షన్ల మీద బాక్సాఫీసు నిపుణులు కొన్ని అంచనాలు వేశారు.
ప్ర‌భాస్ ఆదిపురుష్
ప్ర‌భాస్ ఆదిపురుష్

ప్ర‌భాస్ ఆదిపురుష్

నటుడు ప్రభాస్ ఆదిపురుష్(Adipurush) సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత మంచి హిట్ అందుకోలేని ప్రభాస్ కు ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు ఉన్నాయి. జూన్ 16న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఆదిపురుష్ విజయం సాధించాల్సిన అవసరం ప్రభాస్ కూ చాలా ఉంది. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. బాక్సాఫీసు పండితులు అదే అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్(Kriti Sanon) నటించింది. ఓం రావత్ దర్శకత్వం వహించాడు.

ట్రెండింగ్ వార్తలు

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

పాన్ ఇండియా లెవల్లో ఆదిపురుష్ సినిమా విడుదలవుతోంది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్‌ వస్తుందని అంచనా ఉంది. హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై బాగా హైప్ ఉంది. దీనికి కారణం బాలీవుడ్ ఆర్టిస్టులు నటించడమే. అలాగే ప్రభాస్‌కి నార్త్ ఇండియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇన్ని కారణాల వల్ల హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనూ మొదటి రోజు మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది. మే 9న ట్రైలర్ విడుదలై ఉత్కంఠను పెంచింది. 'తానాజీ' ఫేమ్ ఓం రావత్(om raut) దర్శకత్వం కావడంతో హిందీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు రావణుడిగా సైఫ్ అలీఖాన్, ఆంజనేయుడిగా దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మెుదట ఈ సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి. ట్రైలర్ విడుదల తర్వాత అందరూ మెచ్చుకున్నారు.

రామాయణం ఆధారంగా ఇప్పటికే చాలా సీరియల్స్, సినిమాలు వచ్చాయి. అయితే ఓం రావత్ సినిమా ఎలా తీశాడని ఆసక్తి అందరికీ ఉంది. ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. బాహుబలి 2(Bahubali 2) తర్వాత ప్రభాస్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. కాబట్టి ఆదిపురుష్ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో పాటు 'సాలార్', 'ప్రాజెక్ట్ కె' సినిమా పనుల్లో కూడా ప్రభాస్ బిజీగా ఉన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.