తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  777 Charlie Tv Premier Date: హమ్మయ్య.. రిలీజైన ఏడాది తర్వాత టీవీలోకి వచ్చేస్తున్న 777 ఛార్లీ.. ఎప్పుడు? ఎందులో?

777 Charlie TV Premier Date: హమ్మయ్య.. రిలీజైన ఏడాది తర్వాత టీవీలోకి వచ్చేస్తున్న 777 ఛార్లీ.. ఎప్పుడు? ఎందులో?

Hari Prasad S HT Telugu

06 June 2023, 15:43 IST

    • 777 Charlie TV Premier Date: హమ్మయ్య.. రిలీజైన ఏడాది తర్వాత టీవీలోకి వచ్చేస్తోంది 777 ఛార్లీ మూవీ. గతేడాది సంచలనాలు క్రియేట్ చేసిన ఈ కన్నడ మూవీ టీవీ ప్రీమియర్ డేట్ ను జీ తెలుగు అనౌన్స్ చేసింది.
777 ఛార్లీలో రక్షిత్ శెట్టి
777 ఛార్లీలో రక్షిత్ శెట్టి (twitter)

777 ఛార్లీలో రక్షిత్ శెట్టి

777 Charlie TV Premier Date: వచ్చే సండే జీ తెలుగు ప్రేక్షకులకు పండగే. ఆ ఛానెల్ రెండు గుడ్‌న్యూస్ లను ప్రేక్షకులకు అందించింది. గతేడాది రిలీజై బాక్సాఫీస్ ను షేక్ చేసిన 777 ఛార్లీ మూవీ.. మొత్తానికి టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా జీ తెలుగులో రానుంది. వచ్చే ఆదివారం (జూన్ 11) సాయంత్రం 5.30 గంటలకు 777 ఛార్లీ మూవీ జీ తెలుగులో ప్రసారం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Kannappa: కన్నప్పలో ముగిసిన అక్షయ్ కుమార్ పార్ట్.. మిగిలింది ప్రభాస్? చాలా నేర్చుకున్నానంటూ మంచు విష్ణు

Krishna mukunda murari serial may 4th episode: మురారికి నిజం చెప్పేసిన మీరా.. ముకుంద, ఆదర్శ్ కి పెళ్లి చేద్దామన్న భవానీ

Guppedantha Manasu Serial: ఎండీ ప‌ద‌వికి వ‌సు రాజీనామా - రిషి ఫ్యామిలీ కోసం త్యాగం - ఎట్ట‌కేల‌కు నెర‌వేరిన శైలేంద్ర క‌ల

Brahmamudi May 4th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ- నిజం రాబట్టిన కావ్య- అత్త దగ్గర కోటి కొట్టేసిన స్వప్న

అంతేకాదు ఈ మూవీ పూర్తయిన వెంటనే అంటే అదే రోజు రాత్రి 9 గంటలకు డ్రామా జూనియర్స్ సీజన్ 6 కూడా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంగళవారం (జూన్ 6) జీ తెలుగు ఛానెల్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 777 ఛార్లీ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మొత్తానికి మరో నాలుగు రోజుల్లో రానుంది.

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఒంటరి జీవితంలో గడుపుతున్న ఓ యువకుడి జీవితంలోకి వచ్చిన కుక్క.. అతని లైఫ్ ను ఎలా మారుస్తుందన్నది ఈ 777 ఛార్లీ కథాంశం. ఆ కుక్కతో ఆ యువకుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. మళ్లీ జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకోని ఘటన ఎదురవుతుంది?

ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ఈ 777 ఛార్లీ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ మధ్యే రిలీజై ఏడాది పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మొత్తానికి టీవీ ప్రేక్షకులను అలరించబోతోంది. గతేడాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కన్నడ సినిమాల్లో ఇదీ ఒకటి. సైలెంట్ గా వచ్చి సంచలన విజయం సాధించింది.

నిజానికి చాన్నాళ్ల కిందటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చినా.. దీనిని ఫ్రీగా కాకుండా రూ.129 చెల్లించి చూడాలని నిబంధన విధించింది. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలో ఫ్రీగా అందుబాటులోకి రాలేదు. కన్నడ వెర్షన్ మాత్రం వూట్ సెలక్ట్ లో ఉచితంగా చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.