Rakshit Shetty Birthday : సింపుల్ స్టార్ రక్షిత్ శెట్టి.. నెక్ట్స్ ఏ సినిమాపై ఫోకస్ చేశాడు?-rakshit shetty birthday simple star busy with richard antony script work details inside ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rakshit Shetty Birthday Simple Star Busy With Richard Antony Script Work Details Inside

Rakshit Shetty Birthday : సింపుల్ స్టార్ రక్షిత్ శెట్టి.. నెక్ట్స్ ఏ సినిమాపై ఫోకస్ చేశాడు?

Anand Sai HT Telugu
Jun 06, 2023 08:56 AM IST

Rakshit Shetty Birthday : కన్నడ నటుడు రక్షిత్ శెట్టి.. కొన్ని రోజుల క్రితం చార్లీ 777తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. కాంతార డైరెక్టర్ రిషభ్ శెట్టికి చాలా క్లోజ్ ఫ్రెండ్. జూన్ 6న అతడి పుట్టినరోజు. ఈ సింపూల్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?

చార్లీ 777లో రక్షిత్ శెట్టి
చార్లీ 777లో రక్షిత్ శెట్టి (twitter)

కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి. చార్లీ 777తో పాన్ ఇండియా(Pan India) లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ రక్షిత్ కు ఫ్యాన్స్ ఉన్నారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని ప్రయత్నిస్తాడు. ఆయన డైరెక్షన్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. రక్షిత్ శెట్టి పుట్టినరోజు(Rakshit Shetty) నేడు (జూన్ 6) . శాండల్‌వుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్‌లు సాధించిన ఆయనకు అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరదాచే ఎల్లో ' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ మధ్యలో 'రిచర్డ్ ఆంటోనీ' సినిమా(Richard Antony Cinema) పనులపై ఫొకస్ చేశాడు.

‘రిచర్డ్ ఆంటోనీ’ సినిమాపై రక్షిత్ శెట్టి అభిమానుల్లో ప్రత్యేక అంచనాలున్నాయి. కేజీఎఫ్, కాంతారలాంటి సినిమాలను నిర్మించినన 'హోంబాలే ఫిల్మ్స్' సంస్థ ఈ సినిమాపై పెట్టుబడి పెట్టనుంది. చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రక్షిత్ శెట్టి స్క్రిప్ట్‌పై చాలా శ్రద్ధ చూపుతున్నాడు. 'రిచర్డ్ ఆంటోనీ' స్క్రిప్ట్‌ను ఖరారు చేసేందుకు అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. మిగతా పనులన్నీ పక్కనబెట్టి ఈ సినిమా స్క్రిప్ట్‌పై వంద శాతం శ్రద్ధ పెడతానని చెప్పాడు.

మే 10న ఉడిపిలో మీడియాతో మాట్లాడుతూ రక్షిత్ శెట్టి(Rakshit Shetty) తన ఆలోచనను పంచుకున్నాడు. 'నేను అమెరికా వెళ్లిపోతాను. ఓటు వేయాలని ఇన్ని రోజులు ఎదురుచూశాను. లేకుంటే అప్పటికే అమెరికా వెళ్లి ఉండేవాడిని. 'రిచర్డ్ ఆంటోనీ' ఫైనల్ డ్రాఫ్ట్ రాయాల్సి ఉంది. ఇక్కడ ఉంటే డిస్టర్బ్ అవుతుంది. అమెరికా వెళితే ఇక్కడ రాత్రి అయ్యేసరికి అక్కడ ఉదయం అవుతుంది. ఎవరూ డిస్టర్బ్ చేయరు. అందుకే అక్కడికి వెళ్తున్నాను.' అని రక్షిత్ శెట్టి చెప్పాడు.

ఒకే సినిమా సక్సెస్‌ అయిందన్న కారణంతో అదే తరహా సినిమాలను కొనసాగిస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ రక్షిత్ శెట్టి మాత్రం ఆ కోవకు చెందడు. లవ్ స్టోరీ సినిమాలతో ఆయనకు మంచి పేరు వచ్చింది. అలాగని అదే తరహా సినిమాలు చేయలేదు. ‘ఉలిదవారు కందంటే’ సినిమాలో డిఫరెంట్‌గా కనిపించాడు. 'వాస్తు పరాగా', 'రికీ', 'కిరిక్ పార్టీ', '777 చార్లీ'(Charlie 777) ఇలా అన్ని సినిమాల్లోనూ విభిన్నమైన పాత్రలను ప్రయత్నించాడు. ఇప్పుడు 'రిచర్డ్ ఆంటోనీ' సినిమాలో ఎలా కనిపిస్తాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అలాగే ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమాలో రక్షిత్ శెట్టికి రెండు షేడ్స్ ఉన్న పాత్ర ఉంటుంది. అందుకోసం బరువును పెంచుకున్నాడు. హేమంత్ రావ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రక్షిత్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, చైత్ర ఆచార్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇలా మంచి మంచి కథలతో సినిమాలు చేయాలని కోరుకుంటూ.. Happy Birthday Rakshit Shetty.

IPL_Entry_Point

టాపిక్