2018 Telugu Collections: తెలుగులోనూ 2018 బ్లాక్‌బస్టర్ హిట్.. మలయాళ సినిమాకు భారీ లాభాలు
2018 Telugu Collections: తెలుగులోనూ 2018 బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ మలయాళ సినిమాకు భారీ లాభాలు వచ్చాయి. ఇప్పటికే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 2018 నిలిచిన విషయం తెలిసిందే.
2018 Telugu Collections: మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో అద్భుతమైన సినిమా 2018. ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తర్వాత తెలుగులో రిలీజై ఇక్కడా అదే వేగంతో దూసుకెళ్లింది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ హిట్. బయర్లపై లాభాల వర్షం కురిసింది.
టొవినో థామస్ నటించిన 2018 మూవీ 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.9.22 కోట్లు వసూలు చేసింది. నైజాం ఏరియాలో రూ.4.35 కోట్లు, ఆంధ్రా, సీడెడ్ లో కలిపి రూ.4.87 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ.9.22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కాగా.. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.4.34 కోట్లు. ఈ సినిమా తెలుగులో ఓవరాల్ బిజినెస్ రూ.1.8 కోట్లుగా ఉంది.
అంటే బ్రేక్ ఈవెన్ రూ.2 కోట్లు కాగా.. ఇప్పటికే రూ.2.34 కోట్ల లాభాలు వచ్చాయి. దీంతో 2018ను బ్లాక్ బస్టర్ హిట్ గా డిక్లేర్ చేశారు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కించారు. మొదట కేవలం మలయాళంలో రిలీజ్ కాగా.. తర్వాత కొన్ని రోజులకు తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీల్లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో తొలి మూడు రోజుల్లోనే రూ.4.33 కోట్లు వసూలు చేసిన 2018.. తర్వాత తగ్గుతూ వెళ్లింది.
థియేటర్లలో విడుదలైన పది రోజుల్లోనే 2018 తెలుగు వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. జూన్ 7న 2018 మలయాళం వెర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేస్తోన్నట్లు సోనిలివ్ (Sonyliv) ప్రకటించింది. తెలుగు వెర్షన్ థియేటర్లలో ఆడుతుండటంతో ఆలస్యంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ నిర్మాతలకు షాకిస్తూ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అదే రోజు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సోనిలివ్ ప్రకటించింది.
సంబంధిత కథనం