Chiru Remake Movie : మరో మలయాళం రిమేక్​లో మెగాస్టార్.. కుర్ర హీరో కోసం సెర్చింగ్-megastar chiranjeevi planning to remake malayalam movie bro daddy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiru Remake Movie : మరో మలయాళం రిమేక్​లో మెగాస్టార్.. కుర్ర హీరో కోసం సెర్చింగ్

Chiru Remake Movie : మరో మలయాళం రిమేక్​లో మెగాస్టార్.. కుర్ర హీరో కోసం సెర్చింగ్

Anand Sai HT Telugu

Chiranjeevi Bro Dady Movie Remake : మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత యువ దర్శకులతో సినిమాలు చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

భోళా శంకర్ సినిమాలో చిరంజీవి (Twitter)

ప్రస్తుతం భోళా శంకర్(Bhola Shankar) సినిమా షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి బిజీబిజీగా ఉన్నాడు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు చిత్రం రానుంది. వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఓ వైపు సినిమా షూటింగ్ లో ఉంటూనే.. మరోవైపు తర్వాతి సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు చిరు.

ఈ సినిమా తర్వాత.. చిరు చేయబోయే ప్రాజెక్టుల మీద సోషల్ మీడియా(Social Media)లో చర్చ నడుస్తోంది. తన తర్వాతి సినిమాలు యువ దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడట మెగాస్టార్. ఇందులో ముందుగా సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కల్యాణ్ కృష్ణ(kalyan krishna)తో సినిమా చేయనున్నట్టుగా టాక్ నడుస్తోంది. మలయాళం సినిమా బ్రో డాడీ(Bro Dady) చిత్రాన్ని రిమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చర్చ ఉంది. మలయాళంలో మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. మోహన్ లాల్ పాత్రలో చిరు నటిస్తే.. పృథ్విరాజ్ పాత్ర కోసం.. కుర్ర హీరోలను సంప్రదిస్తున్నారట. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సినిమా తర్వాత బింబిసార(Bimbisara) తీసిన డైరెక్టర్ వశిష్టతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట చిరు. ఇది కూడా బింబిసారాలాగే.. పీరియాడికల్ మూవీగా రానుందని టాక్. పాన్ ఇండియా రేంజ్ లో రానున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేసే అవకాశం ఉంది. ఛలో, భీష్మ సినిమాల ఫేమ్ వెంకీ కుడుములతో కూడా ఓ మూవీ ప్లాన్ చేశాడు. కానీ ఎందుకో సినిమా ఆగిపోయింది. ఆచార్య(Acharya) కారణంగా స్టార్ డైరెక్టర్ల విషయంలోనూ మెగాస్టార్ ఆలోచనల్లో పడ్డారని తెలుస్తోంది. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట.

అయితే చిరంజీవి(chiranjeevi) తన తన కూతురి నిర్మాణంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. యంగ్ డైరెక్టర్లతో సినిమా చేయాలని నిర్ణయించినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. కూతురి కోసం.. చిన్న బడ్జెట్(Low Budget) సినిమాను చేసి.. కూతురికి భారీ లాభాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు వచ్చే.. దర్శకులు భిన్నమైన కథలతో వస్తున్నారు. వారిని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో మెగాస్టార్(Mega Star) ఉన్నట్టుగా తెలుస్తోంది. కల్యాణ్ కృష్ణ తీసే సినిమాను చిరంజీవి కుమార్తె నిర్మించే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.