Tamannaah Malayalam Debut: పాన్ ఇండియన్ కల్చర్‌తో సినిమా ఇండస్ట్రీల మధ్య భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. నటీనటులకు ఇతర భాషల్లో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా హీరోయిన్లు ఒకే ఇండస్ట్రీకి పరిమితం కాకుండా దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో పలు ఆఫర్స్ సొంతం చేసుకుంటూ రాణిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోయిన్‌గా పేరుతెచ్చుకున్నమిల్కీబ్యూటీ తమన్నా తాజాగా మలయాళ చిత్రసీమలో తొలి అడుగు వేయబోతున్నది.
తమన్నా సహ హీరోయిన్లు నయనతార, త్రిష మలయాళంలో సినిమాలు చేశారు. విజయాల్ని అందుకున్నారు. కానీ తమన్నా మాత్రం దక్షిణాదిలో తెలుగు, తమిళ భాషలకు మాత్రమే పరిమితమైంది. హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన పదిహేడేళ్ల తర్వాత మలయాళంలోకి తమన్నా ఎంట్రీ ఇవ్వబోతుండటం ఆసక్తికరంగా మారింది.
దిలీప్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో దర్శకుడు అరుణ్ గోపి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో దిలీప్‌కు జోడీగా తమన్నా హీరోయిన్‌గా నటించబోతున్నది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతున్నట్లు సమాచారం. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో తమన్నా ఈ మలయాళ సినిమాను అంగీకరించినట్లు తెలిసింది.
ప్రస్తుతం తెలుగులో తమన్నా భోళాశంకర్, గుర్తుందా శీతాకాలం సినిమాలు చేస్తోంది. హిందీలో తమన్నా నటించిన ప్లాన్ ఏ ప్లాన్ బీతో పాటు బబ్లీ బౌన్సర్ సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.