Amigos day 1 collections: అమిగోస్ వసూళ్ల తగ్గుదల.. బింబిసార కంటే తక్కువ ఓపెనింగ్-kalyan ram amigos movie collections dropped
Telugu News  /  Entertainment  /  Kalyan Ram Amigos Movie Collections Dropped
అమిగోస్ కలెక్షన్లు
అమిగోస్ కలెక్షన్లు

Amigos day 1 collections: అమిగోస్ వసూళ్ల తగ్గుదల.. బింబిసార కంటే తక్కువ ఓపెనింగ్

11 February 2023, 13:09 ISTMaragani Govardhan
11 February 2023, 13:09 IST

Amigos day 1 collections: కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా తొలి రోజు రెండున్నర కోట్లను రాబట్టింది. ఫలితంగా కల్యాణ్ రామ్ గత చిత్రం బింబిసార కంటే తక్కువగా ఓపెనింగ్స్ వచ్చాయి.

Amigos day 1 collections: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం అమిగోస్. బింబిసార లాంటి సక్సెస్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుడా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో విభిన్నంగా ఉంటుందని ఊహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సంస్థ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో వసూళ్లపై కూడా ప్రభావం పడినట్లు తెలుస్తోంది.

అమిగోస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. పిల్మ్ వర్గాల అంచనా ప్రకారం తొలి రోజు ఈ సినిమాకు రెండున్నర కోట్లు వచ్చినట్లు అంచనా. ఇదే సమయంలో బింబిసారకు రూ.7 కోట్ల వరకు రాగా.. అమిగోస్‌కు మాత్రం వసూళ్ల తగ్గుదల కనిపించింది. డోప్లర్ గ్యాంగ్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా రెగ్యూలర్ కమర్షియల్ ప్లాట్‌లో ఉండటంతో మూవీకి మౌత్ టాక్ సరిగ్గా రాలేదు. అంతేకాకుండా రివ్యూలు కూడా యావరేజ్ తేల్చేసరిగా ఆ ప్రభావం వసూళ్లపై పడినట్లు సమాచారం.

బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్‌కు అమిగోస్ రూపంలో మరో సక్సెస్ పడుతుందని ఆశిస్తే వసూళ్లు అనుకున్న స్థాయిలో రావట్లేదని తెలుస్తోంది. తొలి రోజు రెండున్నర కోట్లు మాత్రమే రాబట్టిన ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 12 కోట్ల కావాలంట. ప్రస్తుత బాక్సాఫీస్ కలెక్షన్లు బట్టి చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగా మారింది.

అమిగోస్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నవీన్ యెర్నీని, వై రవిశంకర్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. రాజేంద్ర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ నటి అషికా రంగనాథ్ తెలుగులోకి ఈ సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. జీబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.