Amigos OTT Platform: అమిగోస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే-kalyan ram amigos streaming rights acquired by netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kalyan Ram Amigos Streaming Rights Acquired By Netflix

Amigos OTT Platform: అమిగోస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Nelki Naresh Kumar HT Telugu
Feb 10, 2023 03:36 PM IST

Amigos OTT Platform: క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన అమిగోస్ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

అమిగోస్
అమిగోస్

Amigos OTT Platform: క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన అమిగోస్ సినిమా శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఒకే పోలిక‌ల‌తో ఉన్న ముగ్గురు వ్య‌క్తుల క‌థ‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి ఈ సినిమాను తెర‌కెక్కించారు. అమిగోస్ డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది.

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప‌ది కోట్ల‌కుపైనే వెచ్చించి నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు నుంచి ఆరు వారాల త‌ర్వాత ఈ అమిగోస్ ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలిసింది. సౌత్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతున్నారు.

శుక్ర‌వారం రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ ల‌భిస్తోంది. సిద్ధార్థ్ అనే యువ‌కుడు త‌న రూపంలోనే ఉన్న మైఖేల్‌, మంజునాథ్ అనే వ్య‌క్తుల‌ను క‌లుస్తాడు. మైఖేల్ వ‌ల్ల మిగిలిన ఇద్ద‌రు ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్నారు? అస‌లు ఆ మైఖేల్ ఎవ‌ర‌నే పాయింట్‌తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందింది.

మూడు పాత్ర‌ల్లో క‌ళ్యాణ్ రామ్ యాక్టింగ్ వేరియేష‌న్ చూపించిన విధానం ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తోంది. అమిగోస్ సినిమాతో క‌న్న‌డ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది. బింబిసార త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ న‌టించిన సినిమా ఇది.

IPL_Entry_Point