The Romantics in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ది రొమాంటిక్స్.. వాలెంటైన్స్ డే నాడు స్ట్రీమింగ్
The Romantics in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ది రొమాంటిక్స్ (The Romantics) అనే డాక్యు సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. వాలెంటైన్స్ డే స్పెషల్ గా వస్తున్న ఈ సిరీస్ యశ్ చోప్రా సినిమాలను సెలబ్రేట్ చేయనుంది.
The Romantics in Netflix: ఈ ఏడాది వాలెంటైన్స్ డేను స్పెషల్ గా సెలబ్రేట్ చేయనుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. ఫాదర్ ఆఫ్ రొమాన్స్ గా పేరుగాంచిన ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత యశ్ చోప్రాను మూవీస్ ను సెలబ్రేట్ చేసుకునేలా ఓ ప్రత్యేకమైన డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించింది. ఈ డాక్యు సిరీస్ పేరు ది రొమాంటిక్స్(The Romantics).
ఈ డాక్యు సిరీస్ నాలుగు భాగాలుగా స్ట్రీమ్ కానుంది. యశ్ చోప్రా డైరెక్ట్ చేసిన మూవీస్ తోపాటు అతని ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన రొమాంటిక్ సినిమాల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. అంతేకాదు ఇందులో బాలీవుడ్ కు చెందిన 35 మంది ప్రముఖ నటీనటులు, ఇతరులు యశ్ చోప్రా లెగసీపై మాట్లాడనున్నారు.
ఈ సిరీస్ ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ది రొమాంటిక్స్ ట్రైలర్ బుధవారం (ఫిబ్రవరి 1) ఏకంగా 190 దేశాల్లో రిలీజ్ కానుంది. అంతేకాదు ఈ సిరీస్ 32 భాషల్లో సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.
ఈ సిరీస్ పై నెట్‌ఫ్లిక్స్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ స్పందించారు. యశ్ చోప్రా సినిమాలు సంస్కృతిలో మార్పు తీసుకొచ్చి ఓ కొత్త ఎమోషన్ ను పరిచయం చేశాయని ఆమె చెప్పారు. ఈ డాక్యు సిరీస్ కు స్మృతి ముంద్రా దర్శకత్వం వహించింది.
యశ్ చోప్రా బాలీవుడ్ లో ఎంతో పేరుగాంచిన డైరెక్టర్, ప్రొడ్యూసర్. అతని డైరెక్షన్ లో దీవార్, కభీ కభీ, సిల్సిలా, చాందినీ, డర్, దిల్ తో పాగల్ హై, వీర్ జారా, జబ్ తక్ హై జాన్ లాంటి సినిమాలు వచ్చాయి. ఇక అతని ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ద్వారా మరెన్నో రొమాంటిక్ సినిమాలు రూపొందాయి.
సంబంధిత కథనం