Amigos Pre Release Business: రిలీజ్‌కు ముందే నిర్మాత‌ల‌కు లాభాల్ని మిగిల్చిన క‌ళ్యాణ్ రామ్ మూవీ-kalyan ram amigos pre release business satellite digital rights details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amigos Pre Release Business: రిలీజ్‌కు ముందే నిర్మాత‌ల‌కు లాభాల్ని మిగిల్చిన క‌ళ్యాణ్ రామ్ మూవీ

Amigos Pre Release Business: రిలీజ్‌కు ముందే నిర్మాత‌ల‌కు లాభాల్ని మిగిల్చిన క‌ళ్యాణ్ రామ్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Feb 09, 2023 06:58 AM IST

Amigos Pre Release Business: క‌ళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్‌లో న‌టించిన అమిగోస్ సినిమా ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా నిర్మాత‌ల‌కు లాభాల‌ను మిగిల్చిన‌ట్లు స‌మాచారం.

క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్‌
క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్‌

Amigos Pre Release Business: చాలా కాలం త‌ర్వాత బింబిసార‌తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు క‌ళ్యాణ్‌రామ్‌. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ త‌ర్వాత మ‌రోసారి ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో క‌ళ్యాణ్‌రామ్ చేసిన తాజా చిత్రం అమిగోస్‌.

క్రైమ్ థ్రిల్ల‌ర్ పాయింట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ త్రిబుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 10న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఒకే పోలిక‌ల‌తో ఉన్న ఏ మాత్రం సంబంధం లేని ముగ్గురు వ్య‌క్తుల క‌థ‌తో ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి అమిగోస్ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు.

ట్రైల‌ర్ టీజ‌ర్స్‌తో అమిగోస్ తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. టాక్ బాగుండ‌టం, బింబిసార స‌క్సెస్ కార‌ణంగా రిలీజ్‌కు ముందే క‌ళ్యాణ్‌రామ్ సినిమా నిర్మాత‌ల‌కు లాభాల‌ను మిగిల్చిన‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ రైట్స్ దాదాపు ప‌ది కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. శాటిలైట్‌, డిజిట‌ల్ రూపంలో రూపంలో మ‌రో ప‌ది కోట్లు నిర్మాత‌ల‌కు ద‌క్కిన‌ట్లు తెలిసింది.

అలాగే డ‌బ్బింగ్‌, ఓవ‌ర్‌సీస్ బిజినెస్ ఆరు నుంచి ఏడు కోట్ల మ‌ధ్య జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. 20 నుంచి 22 కోట్ల మ‌ధ్య‌ బ‌డ్జెట్‌తో అమిగోస్ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు స‌మాచారం. రిలీజ్‌కు ముందే నిర్మాత‌ల‌కు ఈ సినిమా ఐదు కోట్ల వ‌ర‌కు లాభాల‌ను మిగిల్చిన‌ట్లు చెబుతున్నారు.

ఇందులో క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌న్న‌డంలో ప‌దికిపైగా సినిమాలు చేసిన ఆషికా అమిగోస్‌తోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అమిగోస్ సినిమాను నిర్మిస్తోంది.

IPL_Entry_Point

టాపిక్