Ali meets Chiranjeevi: రంజాన్ పర్వదినాన మెగాస్టార్‌ను కలిసిన అలీ.. కమెడియన్‌కు చిరు ప్రత్యేక శుభాకాంక్షలు-comedian ali meets megastar chiranjeevi on the occasion of ramadan festival ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ali Meets Chiranjeevi: రంజాన్ పర్వదినాన మెగాస్టార్‌ను కలిసిన అలీ.. కమెడియన్‌కు చిరు ప్రత్యేక శుభాకాంక్షలు

Ali meets Chiranjeevi: రంజాన్ పర్వదినాన మెగాస్టార్‌ను కలిసిన అలీ.. కమెడియన్‌కు చిరు ప్రత్యేక శుభాకాంక్షలు

Maragani Govardhan HT Telugu
Apr 22, 2023 07:48 PM IST

Ali meets Chiranjeevi: రంజాన్ పర్వదినాన కమెడియన్ అలీ.. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్.. అతడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రంజాన్ సందర్భంగా మెగాస్టార్‌తో అలీ
రంజాన్ సందర్భంగా మెగాస్టార్‌తో అలీ

Ali meets Chiranjeevi: ముస్లీంల పవిత్ర పండగ రంజాన్(Eid al Fitr) వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పిల్ల, పెద్ద అందరూ కలిసి ఈ పర్వదినాన ఆనందకరంగా జరుపుకుంటున్నారు. ఇంక సెలబ్రెటీల దగ్గరకొస్తే ఇంకా అద్భుతంగా జరుపుకుంటున్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ నటుడు అలీ(Ali).. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.

మరోపక్క అలీ కూడా రంజాన్ పర్వదినాన్ని మెగాస్టార్‌తో(Megstar Chiranjeevi) పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని అలీ అన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని అలీ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవితో అలీ, ఆయన కుటుంబ సభ్యులు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. అలీకి, ఆయన కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం అలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారునిగా కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పదవీలో నియమించారు. అలీ ఓ పక్క సినిమాలతో పాటు మరోపక్క రాజకీయపరమైన కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా బుల్లితెర వ్యాఖ్యతగానూ వ్యవహరిస్తున్నారు.

Whats_app_banner