Ali About Pawan Kalyan: అలీ కూతురు వివాహానికి పవన్ కల్యాణ్ అందుకే రాలేదు.. ఏమైందంటే?-comedian ali clarity on pawan kalyan not attending to his daughter wedding ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Comedian Ali Clarity On Pawan Kalyan Not Attending To His Daughter Wedding

Ali About Pawan Kalyan: అలీ కూతురు వివాహానికి పవన్ కల్యాణ్ అందుకే రాలేదు.. ఏమైందంటే?

Maragani Govardhan HT Telugu
Dec 02, 2022 10:34 PM IST

Ali About Pawan Kalyan: అలీ కుమార్తే వివాహానికి పవన్ కల్యాణ్ రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై అలీ క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు.

అలీ-పవన్ కల్యాణ్
అలీ-పవన్ కల్యాణ్

Ali About Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ కమెడియన్ అలీ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ ఆరంభమైనప్పటి నుంచి దాదాపు ప్రతి సినిమాలోనూ ఆయన ఉన్నారు. అలాంటిది పవర్‌స్టార్ నటించిన ఇటీవల కాలంలో సినిమాల్లో అలీ లేకపోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో పవన్‌ను కాదని వైఎస్ఆర్‌సీపీలో ఆలీ చేరడంతో వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో అలీపై ప్రత్యక్షంగా విమర్శలు కూడా సంధించారు పవన్ కల్యాణ్. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఉండే పవన్ కల్యాణ్, అలీ మధ్య గ్యాప్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం అలీ కుమార్తే వివాహానికి కూడా పవర్ స్టార్ రాకపోవడం గమనార్హం.

అలీ కుమార్తే వివాహానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మంచు విష్ణు తదితరులు హాజరై నూతన వధూ, వరులను ఆశీర్వదించారు. గుంటూరులో నిర్వహించిన వీరి రిసెప్షన్‌ వేడుకకు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు.

తమ కూతురు పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అలీ సతీమణి జుబేదా ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేస్తూనే ఉంది. అయితే ఈ వివాహ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాకపోవడంతో సర్వత్రా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీరి బంధం గురించి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా నటుడు అలీ స్పందించాడు. పవన్‌కల్యాణ్.. తన కుమార్తే వివాహానికి రాకపోవడానికి గల కారణాలను వివరించారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. "నా కుమార్తే పెళ్లికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. వివాహానికి రావాల్సిందిగా శుభలేఖ కూడా ఇచ్చాను. ఆయన కూడా వస్తానని చెప్పారు. దాంతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి రూట్ మ్యాప్ తీసుకున్నారు. చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో ఆయన రాలేకపోయారు. దీంతో ఆయన నాకు కాల్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా వధూవరులు ఇద్దరు ఇంట్లోనే ఉన్నప్పుడు నేను బయటకు వచ్చి కలుస్తాను" అని వివరించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.