Sushanth in Chiranjeevi Movie: చిత్రసీమలో అందరికీ అదృష్టం వరిస్తుందనడానికి లేదు. అది పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా లేక స్వయంకృషితో అడుగుపెట్టినా బ్రేక్ అనేది చాలా అరుదుగా మాత్రమే దొరుకుతుంది. అయితే కొంతమందికి మాత్రమే మెయిన్ లీడ్ కలిసొస్తుంది. కానీ మరికొంతమంది మాత్రం హీరోగా కలిసి రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారమెత్తి సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పుడు అక్కినేని హీరో సుశాంత్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఇప్పటికే అల వైకుంఠపురములో సైడ్ క్యారెక్టర్‌లో కనిపించిన ఈ హీరో తాజాగా మరో భారీ సినిమాలో ఆఫర్ కొట్టేశారు.,మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భోళా శంకర్ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ యువ హీరో వరుస పెట్టి క్యారెక్టర్లు చేజిక్కించుకుంటూ దూసుకెళ్తున్నాడు. సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతడి లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.,అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో సుశాంత్ లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నాడని వినికిడి. మహాశివరాత్రికి స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించనుంది.,భోళా శంకర్ సినిమాతో పాటు సుశాంత్ మరో క్రేజీ ప్రాజెక్టులోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు. మాస్ రాజా మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రంలోనూ విలన్‌గా నటిస్తున్నాడు సుశాంత్. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ అవకాశాలు వస్తున్నాయని సమాచారం. మరోపక్క సోలో హీరోగానూ అతడు సినిమాలు చేస్తున్నాడు.,