777 charlie telugu ott release: 777 ఛార్లి తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే – ఫ్రీ స్ట్రీమింగ్ లేదు
25 September 2022, 11:34 IST
777 charlie telugu ott release: 777 ఛార్లి సినిమా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 30న రెంటల్ విధానంలో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సినిమా రిలీజ్ కానుందంటే...
777 ఛార్లి
777 charlie telugu ott release: రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 777 ఛార్లి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ గా నిలిచింది. ఛార్లి అనే డాగ్ తో ఓ యువకుడికి ఏర్పడిన అనుబంధాన్ని చాబుతూ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు కిరణ్ రాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 10న కన్నడంతో పాటు తెలుగు,తమిళం,మలయాళం,హిందీ భాషల్లో ఈసినిమా రిలీజ్ అయ్యింది. కన్నడంలో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
కన్నడ వెర్షన్ ఓటీటీలో జూలైలోనే రిలీజ్ అయ్యింది. కానీ తెలుగు తో పాటు మిగతా భాషల్లో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. సినిమా రిలీజై మూడు నెలలు దాటిపోయినా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా 777 చార్లి సినిమా సెప్టెంబర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం,మలయాళం,హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కానీ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్కైబర్లు అందరూ ఈసినిమా చూడలేరు.
రెంటల్ విధానంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తో పాటు ఆనందంగా డబ్బులు చెల్లించిన వారే ఈ సినిమా చూడచ్చు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించారు.