తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kissing Device: దూరంగా ఉన్నా ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవచ్చు! కిస్‍ల కోసం డివైజ్

Kissing Device: దూరంగా ఉన్నా ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవచ్చు! కిస్‍ల కోసం డివైజ్

26 February 2023, 13:43 IST

    • Kissing Device: లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‍షిప్‍లో ఉన్న లవర్స్ కోసం కిస్సింగ్ డివైజ్‍ను ఓ వ్యక్తి రూపొందించారు. ఈ డివైజ్, ఓ యాప్ ద్వారా వర్చువల్‌గా కిస్‍లను పార్ట్‌నర్‌కు పొంపొచ్చు.
Kissing Device: దూరంగా ఉన్నా ఒకరికొకరు ముద్దులు పెట్టేసుకోవచ్చు
Kissing Device: దూరంగా ఉన్నా ఒకరికొకరు ముద్దులు పెట్టేసుకోవచ్చు (Mint)

Kissing Device: దూరంగా ఉన్నా ఒకరికొకరు ముద్దులు పెట్టేసుకోవచ్చు

Kissing Device: వేర్వేరు చోట్ల దూరంగా ఉండే ప్రేమ జంటకు విరహతాపం తప్పదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‍ (Long Distance Relationship) లో ఉన్న వారు వారి లవర్‌తో ఎంతైనా ఫోన్‍లో మాట్లాడాల్సిందే. లేకపోతే వీడియో కాల్‍లో ముచ్చటించుకోవాల్సిందే. ఫిజికల్ రొమాన్స్ మాత్రం సాధ్యం అవదు. ఇలాంటి సమస్యే చైనాకు చెందిన జియాంగ్ జోంగ్లీ (Jiang Zhongli)కి ఎదురైంది. తన గర్ల్ ఫ్రెండ్ వేరే ప్రాంతంలో ఉండటంతో కేవలం ఫోన్లలో మాత్రమే మాట్లాడడం వీలయ్యేది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు అతడు ఏకంగా కిస్సింగ్ డివైజ్‍ను కొనుగొన్నాడు. వర్చువల్‍గా రొమాన్స్ చేసుకునేలా దీన్ని రూపొందించాడు. లాంగ్ డిస్టెన్స్ కపుల్స్ కోసం దీన్ని తయారు చేశాడు. ఇదెలా పని చేస్తుందంటే..

Kissing Device: “కిస్సింగ్ డివైజ్” పేరుతో తయారైన ఈ డివైజ్ సోషల్ మీడియాలో బజ్ సృష్టిస్తోంది. చంగ్జౌ (Changzhou) లోని ఓ యూనివర్సిటీలో ఈ డివైజ్‍ను కనుగొన్నారు. సిలికాన్‍తో తయారు చేసిన పెదాలను (Silicone Lips) ఈ కిస్సింగ్ డివైజ్ కలిగి ఉంది. ఈ లిప్స్ ఒత్తిడి (Pressure)ని, మూవ్‍మెంట్, పెదాల వేడిని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రెజర్ సెన్సార్లు, యాక్యురేటర్లు ఈ డివైజ్‍లో ఉంటాయి. రియల్ కిస్ ఫీలింగ్‍ను ఇచ్చే ఈ కిస్సింగ్ డివైజ్‍ గురించి చైనాలోని గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

ఎలా పని చేస్తుందంటే..

Kissing Device: ముందుగా.. ఈ కిస్సింగ్ డివైజ్ ఉన్న యూజర్లు.. వారి ఫోన్‍లో ఓ యాప్‍ను డౌన్‍లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చార్జింగ్ పోర్టు ద్వారా ఈ డివైజ్‍ను ఫోన్‍కు కనెక్ట్ చేసుకోవాలి. అనంతరం లవ్ కపుల్స్.. వీడియో కాల్ మొదలుపెట్టి ఈ కిస్సింగ్ డివైజ్ పెదాలకు ముద్దు పెట్టి.. యాప్ ద్వారా పార్ట్‌నర్‌ డివైజ్‍కు కిస్‍లను పంపొచ్చు. కిస్సింగ్ మోషన్, యూజర్ చేసే సౌండ్‍ను కూడా ఈ డివైజ్ ట్రాన్స్‌ఫర్ చేయగలదు. ఇలా లవర్స్ ఒకరికొకరు ఈ డివైజ్‍కు కిస్‍లను పెడుతూ పంపుకోవచ్చు.

Kissing Device: శారీరకంగా దూరంగా ఉన్న లాంగ్ డిస్టెన్స్ జంటలు.. ఫిజికల్ ఇంటిమసీని షేర్ చేసుకునేలా ఈ కిస్సింగ్ డివైజ్ ఉంది. ఈ డివైజ్ పట్ల చైనాలోని సోషల్ మీడియా యూజర్లు కొందరు ఉత్సాహం కనబరుస్తుంటే.. మరికొందరు షాక్ వ్యక్తం చేస్తున్నారు.

ఈ కిస్సింగ్ డివైజ్‍ను ‘అసభ్యకరం’ అంటూ కొందరు సోషల్ మీడియా యూజర్లు విమర్శిస్తున్నారు. పిల్లలు దీన్ని కొనుగోలు చేసి వినియోగిస్తే దుష్ప్రభావం ఉంటుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ డివైజ్‍పై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.