తెలుగు న్యూస్  /  బిజినెస్  /  5g On Iphone: మరో వారంలో ఈ ఐఫోన్ యూజర్లకు 5జీ సేవలు

5G on iPhone: మరో వారంలో ఈ ఐఫోన్ యూజర్లకు 5జీ సేవలు

HT Telugu Desk HT Telugu

06 November 2022, 9:05 IST

    • 5G on iPhone: మరో వారంలో పలు ఐఫోన్ యూజర్లకు 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి.
వచ్చే వారంలోనే ఐఫోన్లపై 5జీ సేవలు
వచ్చే వారంలోనే ఐఫోన్లపై 5జీ సేవలు (AFP)

వచ్చే వారంలోనే ఐఫోన్లపై 5జీ సేవలు

ఆపిల్ మరో వారం రోజుల్లో ఐఓఎస్ అప్‌డేట్ తీసుకురానుంది. ఈ అప్‌డేట్ ద్వారా ఇండియాలో ఐఫోన్ యూజర్లు 5జీ సేవలు పొందడానికి వీలవుతుంది. ఆపిల్ ఐఫోన్లపై 5జీ సేవలు ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్‌వేర్ ఉన్న వారికి అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. అంటే అందరు యూజర్లు 5జీ సేవలు పొందలేరు. ఆపిల్ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ కోసం ఎన్‌రోల్ చేసుకున్నవారు మాత్రమే ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్‌వేర్ ద్వారా 5జీ సేవలు పొందుతారు.

ఇండియాలో అక్టోబరు 1న 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ 5జీ నెట్‌వర్క్‌ను పలు నగరాల్లో అందుబాటులోకి తెచ్చాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ భాగం 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5జీ సేవలు నడిచేలా ఆయా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తగిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేశాయి. కానీ శామ్‌సంగ్, ఆపిల్ కంపెనీలు తమ డివైజెస్‌పైన ఇండియాలో 5జీ సేవలు లభ్యమయ్యేందుకు వీలుగా డిసెంబరులోగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తామని చెప్పాయి.

‘ఐఫోన్లలో 5జీ సేవలు లభ్యమయ్యేందుకు మా క్యారియర్ పార్ట్‌నర్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. నెట్‌వర్క్ వ్యాలిడేషన్, క్వాలిటీ టెస్టింగ్, పర్‌ఫార్మెన్స్ టెస్టింగ్ పూర్తయితే అందుబాటులోకి తెస్తాం..’ అని ఆపిల్ గత నెలలో ఒక ప్రకటన విడుదల చేసింది.

‘డిసెంబరు కల్లా ఐఫోన్‌లో తగిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి 5జీ సేవలు లభ్యమయ్యేలా చూస్తాం..’ అని చెప్పింది.

ఐఓఎస్ 16 బీటా అప్‌డేట్ పొందడానికి అనువైన ఆపిల్ డివైజెస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ ఎస్ఈ (థర్డ్ జనరేషన్) మోడల్స్ ఉన్నాయి.

How to get access to Apple Beta Software Program: బీటా వెర్షన్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో చేరడం ఎలా?

వాలిడ్ ఆపిల్ ఐడీ ఉంటే ఆపిల్ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో ఎవరైనా చేరొచ్చు. ఆసక్తి కలిగిన యూజర్లు సైన్ అప్ ప్రాసెస్ సమయంలో ఆపిల్ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ అగ్రీమెంట్‌ను అనుమతిస్తే సరిపోతుంది. అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే ముందే ప్రి రిలీజ్ సాఫ్ట్‌వేర్, లేటెస్ట్ ఫీచర్స్ బీటా యూజర్లు వాడుకోవచ్చు.