తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 10th November Sensex Nifty Opens In Negative Note

Stock Market News : నష్టాలతో స్టాక్ మార్కెట్లు షురూ.. సెన్సెక్స్ 339 పాయింట్లు డౌన్

10 November 2022, 9:46 IST

    • Stock Market News Today : దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు ఉండటంతో సూచీలు రెడ్‍లో షురూ అయ్యాయి.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు (MINT_PRINT)

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market News Today (November 10) : దేశీయ ఈక్విటీ మార్కెట్లు నేడు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 339.40 పాయింట్లు కోల్పోయి 60,694.15 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 105.05 పాయింట్లు క్షీణించి 18,051 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఫార్మా మినహా మిగిలిన రంగాల షేర్లన్నీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ఆటో స్టాక్స్ లో నేడు అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది.

Top Gainer stocks : టాప్ గెయినర్స్ ఇవే

నేటి నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ లిస్ట్ లో సిప్లా, దివీస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్, హెచ్ యూఎల్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.

Top Loser Stocks : టాప్ లూజర్స్ ఇవే

టాటా మోటార్స్, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టైటాన్ షేర్స్ నేడు టాప్ లూజర్స్ గా మొదలయ్యాయి.

Pre-market opening session : ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‍లో సెన్సెక్స్ 449.78 పాయింట్లు (0.74శాతం) కోల్పోయి 60583.77 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 231,30 పాయింట్లు తగ్గి 17,925 పాయింట్ల వద్దకు చేరింది.

అమెరికాతో పాటు ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నాయి. డౌజోన్స్ ఏకంగా 1.95శాతం, నాస్‍డాక్ 2.48శాతం పడిపోయాయి. జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ తో పాటు దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మళ్లీ 20 పైసలు తగ్గింది.

యూఎస్ ద్రవ్యోల్బణ డేటా నేడు రానుండటంతో మదుపరులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీన్ని బట్టే యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై ప్రభావం ఉంటుంది. దీంతో ఈ డేటా చాలా కీలకంగా మారింది.