తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Guide For Monday: నేటి కొనుగోలు జాబితాలో ఈ 6 స్టాక్స్‌

Day trading guide for Monday: నేటి కొనుగోలు జాబితాలో ఈ 6 స్టాక్స్‌

HT Telugu Desk HT Telugu

31 October 2022, 8:42 IST

    • Day trading guide for Monday: నేటి కొనుగోలు జాబితాలో 6 స్టాక్స్‌ను వివిధ అనలిస్ట్ కంపెనీలు, అనలిస్టులు సూచిస్తున్నారు.
బొగ్గు వెలికి తీస్తున్న కోల్ ఇండియా కంపెనీ
బొగ్గు వెలికి తీస్తున్న కోల్ ఇండియా కంపెనీ (MINT_PRINT)

బొగ్గు వెలికి తీస్తున్న కోల్ ఇండియా కంపెనీ

స్టాక్ మార్కెట్ ఈక్విటీ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఈక్విటీలు పుంజుకున్నాయి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)లో కూడా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు పెరిగి 59,959.8 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.3 శాతం పెరిగి 17,786.8 పాయింట్ల వద్ద ముగిశాయి. కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభాలు ఇచ్చిన స్టాక్స్ జాబితాలో నిలిచాయి.

ట్రెండింగ్ వార్తలు

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Day trading guide for stock market today: డే ట్రేడింగ్ గైడ్

‘నిఫ్టీ ఇంకా షార్ట్ టర్మ్ అప్‌ట్రెండ్ సూచిస్తోంది. 18,096 మార్కు వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. స్వల్పంగా కరెక్షన్స్ ఉంటే ఇండెక్స్ 17,607 - 17,505 పాయింట్ల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉంటుంది. తిరిగి అప్ ట్రెండ్ కొనసాగేందుకు ఇది దోహదపడుతుంది..’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్, డెరివేటివ్ అనలిస్ట్ సుభాష్ గంగాధరన్ విశ్లేషించారు.

‘నిఫ్టీ 8 సెషన్లలో దాదాపు 800 పాయింట్లు పెరిగాక 17,800 జోన్ వద్ద గత నాలుగు సెషన్లుగా కన్సాలిడేట్ అవుతోంది. దేశీయ కంపెనీల పటిష్టమైన ఆదాయాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం వంటి అంశాలు రానున్న కొద్ది రోజుల్లో నిఫ్టీ 18000 - 18,200 మార్కు దిశగా చేరుకునేందుకు దోహదపడుతాయి..’ అని మోతీలాల్ ఓస్వాల్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు.

‘డెయిలీ టైమ్‌ఫ్రేమ్‌లో నిఫ్టీ ఇండెక్స్ కీలకమైన మూవింగ్ యావరేజ్ వద్ద నిలదొక్కుకుంది. ఇది స్వల్పకాలిక లాభాలను సూచిస్తోంది. స్వల్పకాలంలో ట్రెండ్ సైడ్‌వేస్‌లోగానీ, పాజిటివ్‌గా గానీ కొనసాగుతుంది. ఇక దిగువన 17,700-17,550 వద్ద సపోర్ట్ ఉంది..’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలస్ట్ రూపక్ డె విశ్లేషించారు.

Stocks to buy today as recommended by analysts: ఈరోజు కొనుగోలు కోసం అనలస్టులు సూచిస్తున్న స్టాక్స్

అనూజ్ గుప్తా, వీపీ, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్

కోల్ ఇండియా: Buy Coal India, స్టాప్ లాస్ రూ. 234, టార్గెట్ రూ. 254

టాటా మోటార్స్: Buy Tata Motors, స్టాప్ లాస్ రూ. 384, టార్గెట్ రూ. 445

సుమీత్ బగాడియా, ఈడీ, ఛాయిస్ బ్రోకింగ్ 

యూపీఎల్: Buy UPL, స్టాప్ లాస్ రూ. 690, టార్గెట్ రూ. 740-750

రిలయన్స్ ఇండస్ట్రీస్: Buy Reliance, స్టాప్ లాస్ రూ. 2,460, టార్గెట్ రూ. 2,600-2640

మెహుల్ కొఠారీ, ఏవీపీ-టెక్నికల్ రీసెర్చ్- ఆనంద్ రాఠీ

ఇండియన్ హోటల్స్: BUY Indian Hotels, స్టాప్ లాస్ రూ. 316, టార్గెట్ రూ. 333

మహీంద్రా హాలీడేస్, రిసార్ట్స్:Buy MHRIL, స్టాప్ లాస్ రూ. 275, టార్గెట్ రూ. 300

(ఇక్కడ సూచించిన అభిప్రాయాలు, సిఫారసులు వ్యక్తిగత విశ్లేషకులవి, అలాగే బ్రోకింగ్ కంపెనీలవి. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు..)