Stock market today : లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 140 పాయింట్లు జంప్
06 October 2022, 9:18 IST
- Stock market news : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.
ఇండియా స్టాక్ మార్కెట్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో మొదలుపెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 497పాయింట్ల లాభంతో 58562 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 143పాయింట్లు వృద్ధి చెంది 17417 వద్ద ట్రేడ్ అవుతోంది.
దసరా సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. కాగా.. మంగళవారం దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి. 1277 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 58,065 వద్ద స్థిరపడింది. 387 పాయింట్లు వృద్ధిచెంది.. 17274 వద్ద ముగిసింది నిఫ్టీ. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 58314-17379 వద్ద ప్రారంభించాయి.
పివొట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్టు 17,165- 17056 లెవల్స్ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 17335-17396 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy : హీరో మోటోకార్ప్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్- రూ. 2530, టార్గెట్- రూ. 2750- రూ. 2800
- జేఎస్‌డబ్ల్యూ స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్- రూ. 630, టార్గెట్- రూ. 660
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, టెక్ఎం, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లు..
అమెరికా మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్‌ను స్వల్ప నష్టాలతో ముగించాయి. అమెరికా జాబ్స్ డేటా మరింత బలంగా ఉంది. ఫలితంగా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందన్న అంచనాలు పెరిగాయి. డౌ జోన్స్ 0.14శాతం, ఎస్ అండ్ పీ 500 0.2శాతం, నాస్డాక్ 0.25శాతం మేర నష్టపోయాయి.
ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.7శాతం లాభాల్లో ఉంది. హాంగ్‌సెంగ్ సూచీ 0.48శాతం నష్టపోయింది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.17శాతం పడింది. సౌత్ కొరియా కాస్పి 0.8శాతం వృద్ధిచెందింది.
చమురు ధరలు..
Crude oil price latest : ముడి చమరు ఉత్పత్తిని రోజుకు 2మిలియన్ బ్యారెళ్లకుపైగా తగ్గించాలని ఒపెక్ ప్లస్ దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ 46సెంట్లు పెరిగి.. బ్యారెల్‌కు 93.83డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,344.63కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 945.92కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.