Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 6 స్టాక్స్​..-day trading guide for today 6 stocks to buy today 6th october ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 6 స్టాక్స్​..

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 6 స్టాక్స్​..

Sharath Chitturi HT Telugu
Oct 06, 2022 07:58 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన 6 స్టాక్స్​ గురించి స్టాక్​ మార్కెట్​ నిపుణులు వివరించారు. వాటిని మీరు తెలుసుకోండి.

<p>ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 6 స్టాక్స్​..</p>
ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 6 స్టాక్స్​.. (PTI)

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్లకు దసరా సందర్భంగా బుధవారం సెలవు. అయితే.. మంగళవారం మాత్రం మార్కెట్లలో బుల్​ జోరు కనిపించింది. గత 5 వారాల్లోనే మెరుగైన ప్రదర్శన మంగళవారం నాడు చేశాయి సూచీలు. నిఫ్టీ50.. 386 పాయింట్లు వృద్ధిచెంది 17,274 వద్ద స్థిరపడింది. ఇక సెన్సెక్స్​ 1276పాయింట్లు పెరిగి 58,065 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ సూచీ 1080 పాయింట్లు పెరగడంతో 39,110మార్కును తిరిగి అందుకుంది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ సపోర్టు 16,800 వద్ద ఉంది. గతంలో ఇదే పాయింట్​కు వచ్చి నిఫ్టీ బౌన్స్​ అయ్యింది. కాగా.. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో దేశీయ సూచీల షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ కూడా పాజిటివ్​గా మారిందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ అనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి అన్నారు. 17,300 మార్కు దాటడం అత్యంత కీలకం అని వెల్లడించారు.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy list : హీరో మోటోకార్ప్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 2530, టార్గెట్​- రూ. 2750- రూ. 2800
  • జేఎస్​డబ్ల్యూ స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 630, టార్గెట్​- రూ. 660
  • ఐసీఐసీఐ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ 838, టార్గెట్​ రూ. 910.
  • టాటా మోటార్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 377, టార్గెట్​- రూ. 440
  • ఆర్తి ఇండస్ట్రీస్​:- బై రూ. 774, స్టాప్​ లాస్​- రూ. 754, టార్గెట్​- రూ. 815
  • ధామ్​పూర్​ షుగర్​:- బై రూ. 217, స్టాప్​ లాస్​- రూ. 210, టార్గెట్​- రూ. 225

(గమనిక:- ఇవి కేవలం నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. సొంతంగా ఎనాలసిస్​ ఉండటం ట్రేడర్లకు శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం