తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Shares: మిడ్ టెర్మ్ స్టాక్ బెట్ టాటా మోటార్స్: ప్రభుదాస్ లీలాధర్

Tata Motors shares: మిడ్ టెర్మ్ స్టాక్ బెట్ టాటా మోటార్స్: ప్రభుదాస్ లీలాధర్

HT Telugu Desk HT Telugu

05 October 2022, 14:01 IST

google News
    • టాటా మోటార్స్ మిడ్ టెర్మ్ టాప్ స్టాక్ బెట్‌గా ప్రభుదాస్ లీలాధర్ బ్రోకరేజ్ సంస్థ రెకమెండ్ చేస్తోంది.
టాటా మోటార్స్ నుంచి ఇటీవలే ఆవిష్కృతమైన టియాగో ఈవీ
టాటా మోటార్స్ నుంచి ఇటీవలే ఆవిష్కృతమైన టియాగో ఈవీ (AFP)

టాటా మోటార్స్ నుంచి ఇటీవలే ఆవిష్కృతమైన టియాగో ఈవీ

టెక్నికల్ అంశాల ఆధారంగా టాప్ మీడియం-టర్మ్ స్టాక్ పిక్‌గా టాటా మోటార్స్‌ను దేశీయ బ్రోకరేజ్, రీసెర్చ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ సిఫారసు చేసింది. సమీప కాలంలో ఈ ఆటో స్టాక్‌ 11% రాబడి ఇస్తుందని విశ్లేషించింది.

‘తగిన కరెక్షన్ తర్వాత టాటా మోటార్స్ షేరు ధర రూ. 390 జోన్‌కు సమీపంలో డైలీ చార్ట్‌లో ఛానల్ ప్యాటర్న్ యొక్క ట్రెండ్‌లైన్ మద్దతుతో దిగువకు పడిపోయింది..’ అని బ్రోకరేజ్ సంస్థ నివేదించింది.

‘చార్ట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ (RSI) సూచిక ప్రకారం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఓవర్‌సోల్డ్ జోన్ నుండి ట్రెండ్ రివర్సల్‌ను చూపుతుంది. ఈ స్టాక్ మరింత లాభపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రూ. 388 స్టాప్ లాస్‌ పెట్టుకుని రూ. 450 అప్‌సైడ్ టార్గెట్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయొచ్చని సూచిస్తున్నాం..’ అని ప్రభుదాస్ లీలాధర్ బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.

సెప్టెంబర్‌లో మొత్తం దేశీయ విక్రయాలు 44 శాతం పెరిగి 80,633 యూనిట్లకు చేరుకున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. ముంబైకి చెందిన ఈ వాహన తయారీ సంస్థ సెప్టెంబర్ 2021లో తన డీలర్లకు 55,988 యూనిట్లను పంపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో దేశీయ పాసింజర్ వాహనాలను 25,730 యూనిట్ల మేర విక్రయించగా, ఈ ఏడాది సెప్టెంబరులో మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 85 శాతం పెరిగి 47,654 యూనిట్లుగా నమోదయ్యాయి.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ గత నెలలో నెక్సాన్, పంచ్‌ల రికార్డు అమ్మకాలతో కంపెనీ తమ నెలవారీ అత్యధిక విక్రయాలను నమోదు చేసిందని వివరించారు. ‘ఇటీవల ప్రారంభించిన టియాగో ఈవీతో కంపెనీ కొత్త అవకాశాలకు తెరతీసింది. దేశవ్యాప్తంగా ఈవీలను భారీగా విక్రయించడానికి సిద్ధంగా ఉంది. పండుగ సీజన్‌లో సరఫరాను మెరుగుపరుస్తూ భారీ విక్రయాలను చూస్తామని భావిస్తున్నాం.. ’ అని అన్నారు.

టాటా భారతదేశ ఈవీ మార్కెట్‌లో అగ్రగామిగా ఉంది. ప్రభుత్వ రాయితీలు, దిగుమతులపై అధిక సుంకాల సహాయంతో కంపెనీ తన ఎలక్ట్రిక్ పాసింజర్ వెహికిల్ పోర్ట్‌ఫోలియోను ప్రస్తుతం 3 ఈవీల నుండి 2025-26 ఆర్థికం సంవత్సరం నాటికి 10కి విస్తరించాలని భావిస్తోంది. Tiago EV ప్రీమియం ఫీచర్లతో చిన్న కారు కోసం చూస్తున్న ప్రస్తుత ఈవీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది.

(పైన చేసిన అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హెచ్‌టీకి చెందినవి కావు.)

తదుపరి వ్యాసం