తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 06 January 2023 Sensex And Nifty Opens Flat

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 5 పాయింట్ల లాభం

06 January 2023, 9:17 IST

    • Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగిశాయి.
ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​

ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 51 పాయింట్ల లాభంతో 60,404 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 5పాయింట్లు పెరిగి 17,997 వద్ద కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Netflix with Airtel: ఈ ఎయిర్ టెల్ ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ఫ్రీ

Ampere Nexus e-scooter: రివర్స్ మోడ్, 136 కిమీ రేంజ్ తో భారత్ లోకి యాంపియర్ నెక్సస్ ఈ-స్కూటర్

ITR filing 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఫామ్ 16 గురించి ఈ విషయాలు తెలుసుకోండి

Air India-Vistara merger: ఎయిర్ ఇండియా - విస్తారా విలీనంపై కీలక అప్ డేట్ ఇచ్చిన టాటా సన్స్

అంతర్జాతీయ ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 304 పాయింట్ల నష్టంతో 60,353 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 50 పాయింట్లు కోల్పోయి 17,992 వద్దకు చేరింది. బ్యాంక్​ నిఫ్టీ.. 350 పాయింట్ల లాస్​తో 42,608 వద్ద ముగిసింది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​- నిఫ్టీలు వరుసగా 60388- 18008 వద్ద మొదలుపెట్టాయి.

ఫెడ్​ మినిట్స్​ ఆఫ్​ మీటింగ్​ బయటకు రావడంతో అంతర్జాతీయ ప్రతికూల పవనాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం దిగొస్తున్నప్పటికీ.. వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందని.. గత ఫెడ్​ సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా వడ్డీ రేట్ల పెంపు తీవ్రత కొనసాగుతుందని మార్కెట్​లో భయాలు నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలపై దృష్టిపెట్టారు.

పివోట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 17,915- 17,861- 17,774 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,089- 18,142- 18,229 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy list : ఐటీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 326, టార్గెట్​ రూ. 340- రూ. 350

లార్సెన్​ అండ్​ టుబ్రో (ఎల్​టీ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2050, టార్గెట్​ రూ. 2125- రూ. 2150

Stocks to buy విప్రో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 365, టార్గెట్​ రూ. 410

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

బజాజ్​ ఫిన్​సర్వ్​, బజాజ్​ ఫినాన్స్​, రిలయన్స్​, ఎన్​టీపీసీ, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫీ, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు అంశం నేపథ్యంలో గురువారం ట్రేడింగ్​ సెషన్​ను అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలతో ముగించాయి. డౌ జోన్స్​ 1.02శాతం పతనమైది. ఎస్​ అండ్​ పీ 500 1.16శాతం, నాస్​డాక్​ 1.47శాతం నష్టాల్లో ముగిశాయి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్​ నిక్కీతో పాటు సౌత్​ కొరియా 0.37శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.34శాతం పెరిగాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1449.45కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు కూడా 194.09కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.