తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mutual Funds Sip : రూ. 10వేల 'సిప్'​ని.. 3ఏళ్లల్లో రూ. 9లక్షలు చేసిన మ్యూచువల్​ ఫండ్స్​

Mutual funds SIP : రూ. 10వేల 'సిప్'​ని.. 3ఏళ్లల్లో రూ. 9లక్షలు చేసిన మ్యూచువల్​ ఫండ్స్​

Vipul Das HT Telugu

18 September 2022, 19:10 IST

google News
    • Mutual funds SIP : మంచి మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెడితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పేందుకు మరో ఉదాహరణ ఇదే! మూడు మ్యూచువల్​ ఫండ్స్​.. నెలవారీ రూ. 10వేల సిప్​ని మూడేళ్లల్లో రూ. 9లక్షలు, అంతకన్నా ఎక్కువగా మార్చాయి.
రూ. 10వేల 'సిప్'​ని.. 3ఏళ్లల్లో రూ. 9లక్షలు చేసిన మ్యూచువల్​ ఫండ్స్​
రూ. 10వేల 'సిప్'​ని.. 3ఏళ్లల్లో రూ. 9లక్షలు చేసిన మ్యూచువల్​ ఫండ్స్​ (istockphoto)

రూ. 10వేల 'సిప్'​ని.. 3ఏళ్లల్లో రూ. 9లక్షలు చేసిన మ్యూచువల్​ ఫండ్స్​

Mutual funds SIP : 'మ్యూచువల్​ ఫండ్స్​ సహీ హే..' అంటూ ఎన్నో యాడ్స్​ వస్తుంటాయి. అది నిజం కూడా! మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడితో మంచి రిటర్నులు సంపాదించవచ్చని ఎన్నో సందర్భాల్లో రుజవైంది. అయితే.. కొన్ని మ్యూచువల్​ ఫండ్స్​, ఇతర వాటితో పోల్చుకుంటే అద్భుతమైన రిటర్నులు తెచ్చిపెడతాయి. వాటిలో పెట్టుబడి పెడితే.. ఇక మదుపర్లకు సంతోషమే. అలాంటి 3 మ్యూచువల్​ ఫండ్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 5స్టార్​ రేటింగ్​ ఉన్న ఈ 3 మ్యూచువల్​ ఫండ్స్​.. రూ. 10వేల నెలవారీ సిప్​ని 3ఏళ్లల్లో రూ. 9లక్షలుగా మార్చడం విశేషం.

Quant Tax Plan - Direct Plan :

ఈ క్వాంట్​ ట్యాక్స్​ ప్లాన్​ డైరక్ట్​ ప్లాన్​ను 2013 జనవరి 1న ప్రారంభించారు. దీనికి 5స్టార్​ రేటింగ్​ ఉంది. 2022 జూన్​ 30 నాటికి.. Quant Tax Plan - Direct growth ఏఎంయూ (అసెట్​ అండర్​ మేనేజ్​మెంట్​) రూ. 1,787.29కోట్లుగా ఉంది. 2022 సెప్టెంబర్​ 16 నాటికి ఈ మ్యూచువల్​ ఫండ్​ ఎన్​ఏవీ రూ. 269.23గా ఉంది. దీని ఎక్స్​పెన్స్​ రేషియో 0.57శాతం. ఇతల ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్స్​తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. మూడేళ్ల ముందు ఈ ఫండ్​లో నెలవారీ రూ. 10వేలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 10.05,531గా ఉంటుంది.

మంచి మ్యూచువల్​ ఫండ్​ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Bank of India Small Cap Fund - Direct Plan

Best mutual funds : బ్యాంక్​ ఆఫ్​ ఇండియా స్మాల్​ క్యాప్​ డైరక్ట్​ ఫండ్​ని 2018 డిసెంబర్​ 19న ప్రారంభించారు. దీనికి కూడా 5 స్టార్​ రేటింగ్​ ఉంది. 2022 జూన్​ 30 నాటికి Bank of India Small Cap Fund - Direct growth ఏఎంయూ రూ. 353.51కోట్లుగా ఉంది. ఇక సెప్టెంబర్​ 16 నాటికి దీని ఎన్​ఏవీ రూ. 29.01గా ఉంది. దీని ఎక్స్​పెన్స్​ రేషియో 1.12శాతం. స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ లిస్ట్​తో పోల్చుకుంటే ఇది ఎక్కువే! మూడేళ్ల ముందు ఈ మ్యూచువల్​ ఫండ్​లో నెలవారీగా రూ. 10వేలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 9,45,874గా ఉంటుంది.

Canara Robeco Small Cap Fund - Direct Plan

ఈ కెనెరా రొబెకో స్మాల్​ క్యాప్​ ఫండ్​ని 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. దీనికి 5స్టార్​ రేటింగ్​ ఉంది. దీని ఏయూఎం రూ. 3,455.06కోట్లుగా ఉంది. దీని ఎన్​ఏవీ రూ. 26.9గా (సెప్టెంబర్​ 16నాటికి) ఉంది. ఈ మ్యూచువల్​ ఫండ్​ ఎక్స్​పెన్స్​ రేషియో 0.47శాతం. స్మాల్​ క్యాప్​ మ్యుచువల్​ ఫండ్స్​ సగటుతో పోల్చుకుంటే ఇది తక్కువగా ఉంది.

Index mutual funds గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Multicap mutual funds గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏవైనా పెట్టుబడులు పెట్టేముందు సొంతంగా ఎనాలిస్​ లేదా మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం