Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే-day trading guide for today 6 stocks to buy or sell today 6th january 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today: 6 Stocks To Buy Or Sell Today 6th January 2023

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 06, 2023 07:00 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే.. (MINT)

Stocks to buy today : అంతర్జాతీయ ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 304 పాయింట్ల నష్టంతో 60,353 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 50 పాయింట్లు కోల్పోయి 17,992 వద్దకు చేరింది. బ్యాంక్​ నిఫ్టీ.. 350 పాయింట్ల లాస్​తో 42,608 వద్ద ముగిసింది. క్యాపిటల్​ గూడ్స్​, ఎఫ్ఎం​ఎసీజీ రంగాలు మినహా.. ఇతర సెక్టార్​ స్టాక్స్​లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

ఫెడ్​ మినిట్స్​ ఆఫ్​ మీటింగ్​ బయటకు రావడంతో అంతర్జాతీయ ప్రతికూల పవనాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం దిగొస్తున్నప్పటికీ.. వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందని.. గత ఫెడ్​ సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా వడ్డీ రేట్ల పెంపు తీవ్రత కొనసాగుతుందని మార్కెట్​లో భయాలు నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలపై దృష్టిపెట్టారు.

స్టాక్​ మార్కెట్​ నిపుణులు ప్రకారం.. నిఫ్టీ డైలీ ఛార్ట్​లో నెగిటివ్​ క్యాండిల్​ ఏర్పడింది. ఒడుదొడుకులతో కూడిన డౌన్​సైడ్​ ట్రెండ్​.. నిఫ్టీలో కొనసాగుతోంది.

Stock market news today : "లోయర్​ టాప్స్​- బాటమ్​తో కూడిన నెగిటివ్​ ఛార్ట్​ పాటర్న్​ నిఫ్టీలో ఏర్పడింది. షార్ట్​ టర్మ్​లో నిఫ్టీ 17,775 లెవల్స్​ను తాకే అవకాశం ఉంది. 18,1000 లెవల్​ రెసిస్టెన్స్​గా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి అభిప్రాయపడ్డారు.

ఎఫ్​ఐఐల అమ్మకాల ఒత్తిడి కారణంగానే స్టాక్​ మార్కెట్​లు పడుతున్నట్టు.. 5పైసా.కామ్​ లీడ్​ రీసెర్చ్​ రుచిత్​ జైన్​ వెల్లడించారు. 'లాంగ్​- షార్ట్​ రేషియో' 36శాతనికి పడిపోయిందని వివరించారు. క్యాష్​ సెగ్మెంట్​లో విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 'బై ఆన్​ డిప్స్​' స్ట్రాటజీని అనుసరించవచ్చని స్పష్టం చేశారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ను అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలతో ముగించాయి. డౌ జోన్స్​ 1.02శాతం పతనమైది. ఎస్​ అండ్​ పీ 500 1.16శాతం, నాస్​డాక్​ 1.47శాతం నష్టాల్లో ముగిశాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1449.45కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు కూడా 194.09కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

స్టాక్స్​ టు బై:-

  • ITC share price target : ఐటీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 326, టార్గెట్​ రూ. 340- రూ. 350
  • లార్సెన్​ అండ్​ టుబ్రో (ఎల్​టీ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2050, టార్గెట్​ రూ. 2125- రూ. 2150
  • Stocks to buy విప్రో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 365, టార్గెట్​ రూ. 410
  • టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 109, టార్గెట్​ రూ. 125
  • పాలీక్యాబ్​:- బై రూ. 2650, స్టాప్​ లాస్​ రూ. 2580, టార్గెట్​ రూ. 2740
  • మ్యాక్స్​ ఫినాన్షియల్​ సర్వీసెస్​ లిమిటెడ్​ (ఎంఎఫ్​ఎస్​ఎల్​):- బై రూ. 735, స్టాప్​ లాస్​ రూ. 715, టార్గెట్​ రూ. 770

(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. ఇది సమాచారం కోసం ప్రచురించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం