Large cap stock picks : 2023లో ఈ స్టాక్స్​ మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే.. లైఫ్​ జింగాలాలా!-top 8 large cap stocks to accumulate over 2023 see full list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Large Cap Stock Picks : 2023లో ఈ స్టాక్స్​ మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే.. లైఫ్​ జింగాలాలా!

Large cap stock picks : 2023లో ఈ స్టాక్స్​ మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే.. లైఫ్​ జింగాలాలా!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 12, 2022 12:24 PM IST

Large cap stock picks : 2023లో కొనుగోలు లేదా యాడ్​ చేసుకోవాల్సిన స్టాక్స్​ లిస్ట్​ను హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీ వెల్లడించింది. ఆ వివరాలు..

2023లో ఈ స్టాక్స్​ మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే.. లైఫ్​ జింగాలాలా!
2023లో ఈ స్టాక్స్​ మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే.. లైఫ్​ జింగాలాలా! (Photo: Mint)

Large cap stock picks : కొవిడ్​ ఆంక్షలతో విలవిలాడిన ప్రపంచం.. 2022లో దాదాపు కోలుకుంది. ఆర్థిక వ్యవస్థలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలుపెట్టాయి. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం మళ్లీ ప్రతికూల పరిస్థితులను సృష్టించింది. ఈ పరిణామాల మధ్య ద్రవ్యోల్బణం తారస్థాయికి పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రపంచ బ్యాంక్​లన్నీ వడ్డీ రేట్లను విపరీతంగా పెంచేశాయి. ఈ ఏడాది మొత్తం మీద.. దాదాపు ఇవే వార్తలు వినిపించాయి. వీటి మధ్య దేశీయ, అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి.

యూఎస్​ ఫెడ్​.. వడ్డీరేట్లను ఇప్పటికే 375బేసిస్​ పాయింట్ల చొప్పున పెంచింది. ఇక ఇండియాలో ఆర్​బీఐ.. ఐదుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఈ పరిస్థితులతో 2023లో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే సూచనలు కనిపిస్తున్నట్టు మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు.

2023 Stocks to buy list : "అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే.. అది ఇండియాకు మంచి వార్త కాదు. అంతర్జాతీయ స్టాక్స్​తో పోల్చుకుంటే ఇండియా స్టాక్స్​ మెరుగైన ప్రదర్శన చేశాయి. వాల్యువేషన్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ భవిష్యత్తులో మాంద్యం వస్తే.. అంతర్జాతీయ స్టాక్స్​తో పాటు దేశీయ స్టాక్స్​ కూడా పడొచ్చు," అని 2023 ఔట్​లుక్​ రిపోర్ట్​లో హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ వెల్లడించింది.

అయితే.. దేశీయ స్టాక్​ మార్కెట్​లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గకపోవచ్చని నివేదిక అభిప్రాయపడింది. ఫలితంగా ఐపీఓలు, ఎఫ్​పీఐలు, ఓఎఫ్​ఎస్​ల దూకుడు కొనసాగవచ్చని పేర్కొంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కొనుగోలు లేదా యాడ్​ చేసుకోవాల్సిన 8 లార్జ్​ క్యాప్​ స్టాక్స్​ లిస్ట్​ను హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ వెల్లడించింది. అవేంటంటే..

స్టాక్​ పిక్స్​..

HDFC securities stock picks : యాక్సిస్​ బ్యాంక్​:- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్ రూ. 933.7, టార్గెట్​ రూ. 1,195

భారతీ ఎయిర్​టెల్:- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​ రూ. 835, టార్గెట్​ రూ. 983

ఇన్ఫోసిస్​​:- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​ రూ. 1568.85, టార్గెట్​ రూ. 1,790​

ఎల్​ అండ్​ టీ:- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​ రూ. 2,154.3, టార్గెట్​ రూ. 2345

రిలయన్స్​ ఇండస్ట్రీస్​:- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​ రూ. 2609.1, టార్గెట్​ రూ. 2708

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా:- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​ రూ. 616.45, టార్గెట్​ రూ. 700

టాటా స్టీల్​:- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్ రూ. 110.45, టార్గెట్​ రూ. 7615

* కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​- డిసెంబర్​ 9 ట్రేడింగ్​ సెషన్​ ముగింపు

(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. ఇది సమాచారం కోసం రాసిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ను సంప్రదించడం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం