తెలుగు న్యూస్  /  Business  /  Stock Market Latest News Day Trading Stocks To Buy Today Stocks To Focus

Day Trading Stocks: ట్రేడర్లూ.. నేడు ఈ స్టాక్‍లపై లుక్కేయండి: నేటి స్టాక్స్ టు ట్రేడ్ లిస్ట్

14 March 2023, 7:06 IST

    • Day Trading Stocks: స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల మధ్య ఉన్నాయి. నెగెటివ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. కాగా, డే ట్రేడింగ్ చేసే వారు నేడు గమనించాల్సిన స్టాక్‍లను నిపుణులు సూచించారు. వివరాలివే..
Stocks to Buy Today: ట్రేడర్లు నేడు లుక్కేయాల్సిన స్టాక్స్.. నేటి ట్రేడర్స్ గైడ్
Stocks to Buy Today: ట్రేడర్లు నేడు లుక్కేయాల్సిన స్టాక్స్.. నేటి ట్రేడర్స్ గైడ్

Stocks to Buy Today: ట్రేడర్లు నేడు లుక్కేయాల్సిన స్టాక్స్.. నేటి ట్రేడర్స్ గైడ్

Day Trading Guide March 14, 2023: అమెరికా బ్యాంకింగ్ రంగంలో ఏర్పడిన సంక్షోభం భారత మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. సోమవారం సెషన్‍ను లాభాలతో మొదలుపెట్టిన భారత సూచీలు ఆ తర్వాత తీవ్రంగా పతమనయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 258.60 పాయింట్లు నష్టపోయి 17,154.30 వద్దకు చేరింది. బీఎస్ఈ నిఫ్టీ 897.28 పాయింట్లు క్షీణించి 58,237.28 వద్ద ముగిసింది. ఇంట్రా డే గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 1000కిపైగా పాయింట్లను కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీలో పతనం కొనసాగింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 920.75 పాయింట్లు నష్టపోయి 39,564.70 పాయింట్లకు పడింది. మార్కెట్‍లో నెగెటివ్ సెంటిమెంట్ కొనసాగుతోంది. మరి నేడు (మార్చి 14, మంగళవారం) స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎనలిస్టుల సూచనల ప్రకారం డే ట్రేడింగ్ చేసే వారు గమనించాల్సిన స్టాక్‍లు ఏవో ఇక్కడ చూడండి. మార్కెట్లు అనూహ్యమైన ఒడిదొడుకుల మధ్య ఉండటంతో ముఖ్యంగా డే ట్రేడింగ్ చేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

ఎస్‍జీఎక్స్ నిఫ్టీ

Day Trading Guide: ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రకారం చూస్తే స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్‍గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 3 పాయింట్ల నష్టంతో ఉంది. సోమవారం సెషన్‍లో అమెరికా మార్కెట్లు కాస్త స్థిరత్వం చూపించాయి. అయితే స్వల్ప నెగెటివ్‍లోనే ఉన్నాయి.

మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంట్ ఏర్పడిందని, టెక్నికల్‍ చార్ట్ పరంగా చూసినా సూచీలు బలహీనతనే సూచిస్తున్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. “నిఫ్టీ షార్ప్ డౌన్ ట్రెండ్‍లో ఉంది. లోవర్ టాప్స్, బాటమ్స్ లాంటి నెగెటివ్ చార్ట్ ప్యాటర్న్స్ ఏర్పడ్డాయి. ప్రస్తుతం కిందిస్థాయిలోనే ఉన్నా రివర్స్ ప్యాటర్న్ ఇంకా కనిపించడం లేదు. ఒకవేళ నిఫ్టీ ఇక్కడి నుంచి ఇంకా పడితే 17,000 నుంచి 16,800 మధ్యకు వెళ్లొచ్చు. ఆ స్థాయిల్లో సపోర్ట్ ఉంది. ఇక నిఫ్టీ పెరిగితే 17,300 నుంచి 17,350 లెవెల్స్ వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది” అని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి పేర్కొన్నారు.

Day Trading Stocks to Buy: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్

  • మెక్‍డోవెల్ (McDowell): బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.775 నుంచి రూ.780, స్టాప్ లాస్: రూ.740
  • వీఆర్ఎల్ లాజిస్టిక్స్: బై అట్ రూ.600, టార్గెట్: రూ.625, స్టాప్ లాస్: రూ.590
  • అపోలో హాస్పిటల్స్: బై అట్ రూ.4345, టార్గెట్: రూ.4470, స్టాప్ లాస్: రూ.4,280
  • ఓఎన్‍జీసీ: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.160 నుంచి రూ.162, స్టాప్ లాస్: రూ.150
  • ఫెడరల్ బ్యాంక్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.136, స్టాప్ లాస్: రూ.122
  • టాటా స్టీల్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.115, స్టాప్ లాస్: రూ.102
  • కోల్గేట్ - పాల్మోలివ్: బై అట్ రూ.1,505, టార్గెట్: రూ.1,540, స్టాప్ లాస్: రూ.1,480
  • హావెల్స్ ఇండియా: బై అట్ రూ.1,205, టార్గెట్: రూ.1,240, స్టాప్ లాస్: రూ.1,180

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)