Samsung Galaxy A14 5G : శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ లాంచ్.. ధర ఎంతంటే!
17 January 2023, 7:19 IST
- Samsung Galaxy A14 5G launched in India : శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇండియాలో శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ లాంచ్
Samsung Galaxy A14 5G launch : ఇండియా మొబైల్ మార్కెట్లో.. వరుస లాంచ్‌లతో బిజీబిజీగా ఉంటోంది దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్. ఓవైపు గ్యాలెక్సీ ఎస్23 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూనే.. మరోవైపు ఓ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో సైలెంట్‌గా విడుదల చేసింది. అదే.. శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ- ఫీచర్స్..
Samsung Galaxy A14 5G features : ఇందులో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఈ గ్యాడ్జెట్లో ఎక్సినోస్ 1330 ఆక్టా- కోర్ ప్రాసెసర్ ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో కూడిన 16జీబీ ర్యామ్ ఉండటం విశేషం. ర్యామ్ ప్లస్ ఫీచర్ కారణంగా.. అదనంగా వర్చువల్ ర్యామ్‌ను యాడ్ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఇక ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీలో ప్రైవేట్ షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా.. కస్టమర్లు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయంతో ఇత గ్యాలెక్సీ వినియోగదారులతో ఫొటోలు, వీడియోలు భద్రంగా షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. నాలుగేళ్ల పాటు ఈ ఫీచర్‌కు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి!
రూ. 50వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే శాంసంగ్ నుంచి లభిస్తున్న ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఫొటోగ్రాఫీ విషయానికొస్తే.. ఈ గ్యాలెక్సీ ఏ14 5జీలో 50ఎంపీ ట్రిపుల్ లెన్స్ రేర్ కెమెరా ఉంటుంది. 13ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ వస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల పాటు ఈ మొబైల్‌ను వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది.
శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ- ధర..
Samsung Galaxy A14 5G price in India : ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ 4జీబీ ర్యామ్- 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా ఉంది. ఇక 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ధర రూ. 18,999గాను.. 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 20,999గాను ఉంది. శాంసంగ్.కామ్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ పార్ట్నర్ స్టోర్స్‌తో పాటు వివిధ ఆన్లైన్ వేదికల్లో ఈ నెల 20 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది. అయితే.. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు.. శాంసంగ్.కామ్‌లో నిర్వహించనున్న లైవ్ కామర్స్ ఈవెంట్లో దీనిని దక్కించుకోవచ్చు.
Samsung Galaxy A14 5G : ఎస్బీ, ఐడీఎఫ్సీ, జెస్ట్‌మనీతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. రూ. 1382 నెలవారీ ఈఎంఐతో ఈ మొబైల్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ లభిస్తుండటం విశేషం.