తెలుగు న్యూస్  /  Business  /  Realme C55 With Iphone 14 Pro Dynamic Island Like Mini Capsule Will Launch Soon In India

Realme: ఐఫోన్ ‘డైనమిక్ ఐల్యాండ్’ లాంటి ఫీచర్‌తో రియల్‍మీ తదుపరి ఫోన్: బడ్జెట్ రేంజ్‍లోనే..!

11 March 2023, 14:53 IST

    • Realme C55: రియల్‍మీ సీ55 మొబైల్ ఇండియాలో త్వరలో లాంచ్ కానుంది. ఐఫోన్ 14 ప్రో మొబైళ్లలో ఉండే డైనమిక్ ఐల్యాండ్‍ను పోలిన ఫీచర్‌తో ఈ ఫోన్ రానుంది.
Realme: ఐఫోన్ ‘డైనమిక్ ఐల్యాండ్’ లాంటి ఫీచర్‌తో రియల్‍మీ తదుపరి ఫోన్ (Photo Credit: Twitter/TechTravie)
Realme: ఐఫోన్ ‘డైనమిక్ ఐల్యాండ్’ లాంటి ఫీచర్‌తో రియల్‍మీ తదుపరి ఫోన్ (Photo Credit: Twitter/TechTravie)

Realme: ఐఫోన్ ‘డైనమిక్ ఐల్యాండ్’ లాంటి ఫీచర్‌తో రియల్‍మీ తదుపరి ఫోన్ (Photo Credit: Twitter/TechTravie)

Realme C55: ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) మోడళ్లలో డైనమిక్ ఐల్యాండ్ (Dynamic Island ) ఎంతో పాపులర్ అయింది. ఈ ఫీచరే ఆ ఫోన్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ట్యాప్ చేసినప్పుడు నాచ్ వద్ద డైనమిక్ ఐల్యాండ్ ఎక్స్‌ప్యాండ్ అవుతుంది. డైనమిక్ ఐల్యాండ్ నుంచి వివిధ యాప్‍లను కంట్రోల్ చేయవచ్చు, బ్యాటరీ వార్నింగ్, ప్రైవసీ ఇండికేటర్లు లాంటి సమాచారాన్ని చూడవచ్చు. ఇంత హైలైట్ అయిన ఫీచర్‌ను రియల్‍మీ ఫాలో అవుతోంది. రియల్‍మీ తదుపరి భారత్‍కు తీసుకురానున్న ఫోన్.. డైనమిక్ ఐల్యాండ్ లాంటి ఫీచర్‌ను కలిగి ఉంటుంది. రియల్‍మీ సీ55 (Realme C55) మొబైల్.. డైనమిక్ ఐల్యాండ్‍ను పోలిన మినీ క్యాప్సుల్ (Mini capsule) అనే ఫీచర్‌తో రానుంది. రియల్‍మీ సీ55 ఫోన్‍ను ఇండియాలో అతిత్వరలో లాంచ్ చేయనుట్టు రియల్‍మీ వెల్లడించింది.

Realme C55 India launch: రియల్‍మీ సీ55ను త్వరలో భారత్‍లో విడుదల చేయనున్నట్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా రియల్‍మీ ప్రకటించింది. ఎంటర్‌టైన్‍మెంట్ కా చాంపియన్ అంటూ ఈ 4జీ ఫోన్‍ను టీజ్ చేసింది. సాధారణంగా సీ సిరీస్‍లో బడ్జెట్ మొబైళ్లనే రియల్‍మీ తీసుకొస్తుంటుంది. ఈ రియల్‍మీ సీ55 కూడా రూ.13వేలలోపు ధరతోనే ఉండే అవకాశం ఉంది.

మినీ క్యాప్సుల్ ఇలా..

Realme C55 Mini capsule: ఫ్రంట్ కెమెరా కోసం రియల్‍మీ సీ55 డిస్‍ప్లే టాప్ సెంటర్‌లో పంచ్ హోల్ ఉంటుంది. మినీ క్యాప్సుల్ ఫీచర్ ఉండటంతో ఏదైనా నోటిఫికేషన్ వస్తే.. పంచ్ హోల్ వద్ద నాచ్ ఎక్స్‌ప్యాండ్ అవుతుంది. చార్జింగ్, బ్యాటరీ ఫుల్, లో బ్యాటరీ వార్నింగ్, డేటా యూసేజ్, సెప్ట్స్ లాంటి సమాచారాన్ని ఈ మినీ క్యాప్సుల్‍లో చూడవచ్చు. అలెర్ట్ వచ్చిన ప్రతీసారి ఈ మినీ క్యాప్సుల్ ఎక్స్‌ప్యాండ్ అవుతుంది.

రియల్‍మీ సీ55 స్పెసిఫికేషన్లు

Reame C55: ఇప్పటికే ఇండోనేషియాలో లాంచ్ అవటంతో రియల్‍మీ సీ55కు సంబంధించిన స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. 6.72 ఫుల్ హెచ్‍డీ+ ఎస్‍సీడీ డిస్‍ప్లేను రియల్‍మీ సీ55 కలిగి ఉండనుంది. ఫోన్ అంచులు ఫ్లాట్‍గా ఉంటాయి. మీడియాటెక్ హీలియో జీ88 4జీ ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్‍మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తుంది.

Reame C55: రియల్‍మీ సీ55 వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉంటాయి. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.