తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme 10 Launched In India: తక్కువ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్లు ఇవే

Realme 10 launched in India: తక్కువ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్లు ఇవే

09 January 2023, 14:20 IST

    • Realme 10 4G launched in India: రియల్‍మీ 10 4జీ మొబైల్ ఇండియాలో అడుగుపెట్టింది. బడ్జెట్ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో లాంచ్ అయింది. ఫస్ట్ సేల్ సందర్భంగా ఆఫర్ కూడా ఉండనుంది. పూర్తి వివరాలు ఇవే.
Realme 10: తక్కువ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 వచ్చేసింది (Photo: Realme)
Realme 10: తక్కువ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 వచ్చేసింది (Photo: Realme)

Realme 10: తక్కువ ధరలో అమోలెడ్ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 వచ్చేసింది (Photo: Realme)

Realme 10 4G launched in India: రియల్‍మీ 10 4జీ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. 2023లో రియల్‍మీ (Realme) నుంచి అడుగుపెట్టిన మొదటి ఫోన్ ఇదే. రియల్‍మీ 10 4జీ సోమవారం (జనవరి 9) భారత్‍లో విడుదలైంది. రియల్‍మీ 10 సిరీస్‍లో మూడో మోడల్ ఇది. అమోలెడ్ డిస్‍ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో ఈ రియల్‍మీ 10 4జీ వచ్చింది. బడ్జెట్ రేంజ్‍లో అడుగుపెట్టింది. ఆండ్రాయిడ్ 12 (Android 12) తోనే వస్తోంది. రియల్‍మీ 10 4జీ పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

రియల్‍మీ 10 4జీ ధర, సేల్, ఆఫర్ల వివరాలు

Realme 10 4G Price, Sale, offers: రియల్‍మీ 10 4జీ మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, రియల్‍మీ అధికారిక వెబ్‍సైట్ (realme.com)తో పాటు రిటైల్ స్టోర్లలో సేల్‍కు వస్తుంది. క్లాష్ వైట్, రష్ బ్లాక్ కలర్లలో ఈ మొబైల్ లభిస్తుంది. కాగా, ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో Realme 10 4G ఫోన్‍ను కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. అంటే బేస్ మోడల్‍ను రూ.12,999కే దక్కించుకోవచ్చు.

రియల్‍మీ 10 4జీ పూర్తి స్పెసిఫికేషన్లు

Realme 10 4G Full Specifications: 6.4 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 4జీ మొబైల్ వస్తోంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండగా.. డిస్‍ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ 4జీ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్‌ను కూడా రియల్‍మీ ఇచ్చింది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‍మీ యూఐతో ఈ ఫోన్ అడుగుపెట్టింది. మైక్రో ఎస్‍డీ కార్డు స్లాట్‍ను కూడా రియల్‍మీ ఈ ఫోన్‍లో ఇచ్చింది.

Realme 10 4G వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ బ్లాక్&వైట్ పొట్రయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. 3.5mm హెడ్‍ఫోన్ జాక్, హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటాయి.

రియల్‍మీ 10 4జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్‍టీఈ, డ్యయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది.

రియల్‍మీ 10 సిరీస్‍లో భాగంగా.. గత నెల భారత్‍లో రియల్‍మీ 10 ప్రో 5జీ, రియల్‍మీ 10 ప్రో+ 5జీ లాంచ్ అయ్యాయి.

తదుపరి వ్యాసం