తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Quarterly Results: పెన్నార్ లాభం రెండింతలు.. పిరమిల్ మూడు రెట్లు

Quarterly results: పెన్నార్ లాభం రెండింతలు.. పిరమిల్ మూడు రెట్లు

HT Telugu Desk HT Telugu

08 February 2023, 18:47 IST

    • Quarterly results: ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రీస్ రెండింతల నికర లాభం చూపగా, పిరమిల్ నికర లాభం 300 శాతం పెరిగినట్టు నివేదించింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (PTI)

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్

విలువ ఆధారిత ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, పరిష్కారాలు అందిస్తున్న హైదరాబాద్‌ సంస్థ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ డిసెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రెండింతలై 97.19 శాతం వృద్ధితో రూ. 21.12 కోట్లు సాధించింది.

2021-22 క్యూ3లో నికరలాభం రూ.10.71 కోట్లు నమోదైంది. ఎబిటా 40.61 శాతం అధికమై రూ.66 కోట్లుగా ఉందని పెన్నార్‌ కార్పొరేట్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.ఎం.సునీల్‌ తెలిపారు.

టర్నోవర్‌ 29.88 శాతం దూసుకెళ్లి రూ. 692.22 కోట్లను తాకిందని చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలంలో నికరలాభం రెండింతలకుపైగా పెరిగి 104.76 శాతం వృద్ధితో రూ.51.58 కోట్లకు చేరుకుంది. ఎబిటా రూ.130.51 కోట్ల నుంచి 40.88 శాతం అధికమై రూ.183.87 కోట్లుగా ఉంది. టర్నోవర్‌ 41.53 శాతం ఎగసి రూ.2,226 కోట్లకు పెరిగింది.

పిరమిల్ నికర లాభం 300 శాతం అప్

పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ Q3 నికర లాభం దాదాపు 300% పెరిగి రూ. 3,545 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం రూ.2,285.22 కోట్ల నుంచి రూ. 3,231.64 కోట్లకు పెరిగింది.

పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ బుధవారం డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 3,545.37 కోట్లకు బహుళ రెట్లు పెరిగిందని నివేదించింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 2,285.22 కోట్ల నుంచి కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం 41.4 శాతం పెరిగి రూ. 3,231.64 కోట్లకు చేరుకుంది.

సెప్టెంబర్ త్రైమాసికంలో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ రూ.1,536.39 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు (EBITDA) 50.2 శాతం క్షీణించి రూ. 993.6 కోట్లకు చేరుకుంది.

టాపిక్