తెలుగు న్యూస్  /  బిజినెస్  /   Oppo A74 5g Price Drop | ఒప్పో 5g ఫోన్‌పై రూ. 6 వేల భారీ డిస్కౌంట్, అమాంతం పడిపోయిన ధర!

OPPO A74 5G Price Drop | ఒప్పో 5G ఫోన్‌పై రూ. 6 వేల భారీ డిస్కౌంట్, అమాంతం పడిపోయిన ధర!

HT Telugu Desk HT Telugu

07 November 2022, 16:28 IST

    • ఒప్పో బ్రాండ్ నుంచి వచ్చిన OPPO A74 5G స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ధర గణనీయంగా పడిపోయింది. వివరాలు చూడండి..
OPPO A74 5G discount Price
OPPO A74 5G discount Price

OPPO A74 5G discount Price

భారతదేశంలో 5G సేవలు అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు 5G స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగింది. జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు 5G నెట్‌వర్క్ సేవలు అందిస్తున్నాయి. అయితే దేశంలో 5G సేవలు అందుబాటులోకి రాకముందే అనేక మొబైల్ కంపెనీలు దేశంలో పుట్లకొద్దీ స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లను విడుదల చేశాయి. వాటిని ఇప్పుడు మళ్లీ డిస్కౌంట్ ధరలతో వినియోగదారుల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Gold and silver prices today : రూ. 66వేల దిగువకు పసిడి ధర- మరింత పడిన వెండి రేటు..

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో తమ A సిరీస్‌లో గతేడాది OPPO A74 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఏకైక 6GB/128GB కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. లాంచింగ్ సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 20,990/- గా ఉండేది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఏకంగా రూ. 6,000 డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ తగ్గింపుతో OPPO A74 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు రూ. 14,990/- ధరకే లభిస్తుంది. Amazonలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMIలు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

మరి ఈ OPPO A74 5G స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ఇతర వివరాలను మరోసారి ఈ కింద పరిశీలించండి.

OPPO A74 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.50 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే

6GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం

Qualcomm స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్

వెనకవైపు 48MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్

ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్

ధర, రూ. 14,990/-

కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ సిమ్‌లు, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, GPS, NFC, హెడ్‌ఫోన్ జాక్, టైప్-సి పోర్ట్‌ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లూయిడ్ బ్లాక్, ఫెంటాస్టిక్ పర్పుల్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతోంది.