Oppo Phones Price Drop । పలు స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లపై ధరలను తగ్గించిన ఒప్పో!-oppo smartphones get price cut while releasing new model of oppo a17k ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oppo Smartphones Get Price Cut While Releasing New Model Of Oppo A17k

Oppo Phones Price Drop । పలు స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లపై ధరలను తగ్గించిన ఒప్పో!

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 09:00 PM IST

Oppo Smartphones Price Drop: ఒప్పో కంపెనీ తాజాగా OPPO A17k పేరుతో ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.మరో వైపు పాత మోడళ్ల ధరలను తగ్గించింది. ఆ వివరాలు చూడండి.

Oppo Smartphones Price Drop
Oppo Smartphones Price Drop

స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO తమ బ్రాండ్ నుంచి భారత మార్కెట్లో విడుదలైన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ధర తగ్గింపును ప్రకటించింది. డిస్కౌంట్ పొందిన మోడళ్లలో Oppo F21 Pro, Oppo A55, Oppo A77 ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇందులో Oppo F21 Pro ధర, రూ. 1500 వరకు తగ్గింది. అలాగే లాంచింగ్ సమయంలో Oppo A55 ధర రూ. 17,490 గా ఉంటే, ప్రస్తుతం బేస్ వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజ్ రూ. 14,499 ధరకు అందుబాటులో ఉంది. ఇందులోనే 6GB RAM వేరియంట్ ఇప్పుడు రూ.14,999 ధరకు లభిస్తోంది.

చివరిది Oppo A77 ఇప్పుడు 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 15,999 ధరకు లభిస్తుంది.

ఈ ధరల మార్పులను పరిశీలిస్తే ఒక్కో మోడల్ పై సుమారు రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే వివిధ బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనంగా మరో 10 శాతం వరకు ధర తగ్గించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మోడళ్ల ఫీచర్లు ఎలా ఉన్నాయో మరోసారి ఇక్కడ పరిశీలించండి.

OPPO A77 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.56 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
  • 4+GB RAM, 128+GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
  • వెనకవైపు 48MP + 2MP డ్యుఎల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W Supervooc ఛార్జర్
  • ధర రూ. 15,999/-

కనెక్టివిటీ పరంగా డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, 5G, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్‌, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

OPPO A55 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.55 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే
  • 4+GB RAM, 128+GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP + 2MP డ్యుఎల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
  • ధర, రూ. 14,499/-

మరోవైపు ఒప్పో, తాజాగా రూ. 10 వేల బడ్జెట్ ధరలో OPPO A17k పేరుతో ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

ఈ ఫోన్ మోడళ్లను ఒప్పో అధికారిక వెబ్‌సైట్ లేదా ఆన్‌లైన్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం