తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Smartwatch Launch: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ లాంచ్.. తక్కువ ధరకే!

New Smartwatch Launch: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ లాంచ్.. తక్కువ ధరకే!

22 February 2023, 13:31 IST

    • NoiseFit Crew Smartwatch launch: నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ విడుదలైంది. తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో అడుగుపెట్టింది.
New Smartwatch Launch: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Noise)
New Smartwatch Launch: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Noise)

New Smartwatch Launch: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Noise)

NoiseFit Crew Smartwatch launched: దేశీయ కంపెనీ నాయిస్ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో నాయిస్‍ఫిట్ క్రూ వాచ్ వచ్చింది. రౌండ్ షేప్డ్ డయల్‍ ఉంటుంది. ఫిట్‍నెస్ ట్రాకింగ్, హెల్త్ ఫీచర్లను ఈ వాచ్ కలిగి ఉంది. ఐదు కలర్ ఆప్షన్‍లలో లభించనుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్‍ను ఈ నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ వస్తోంది. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

NoiseFit Crew Smartwatch Specifications: 1.38 ఇంచుల రౌండ్ షేప్డ్ టచ్ డిస్‍ప్లేతో నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ వస్తోంది. 240x240 పిక్సెల్స్ రెజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. 100కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. స్మార్ ఫోన్‍లో నాయిస్ ఫిట్ యాప్‍కు ఈ వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు.

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఈ నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. దీంతో బ్లూటూత్ ద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ట్రాకర్ SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకింగ్ లాంటి హెల్త్ ఫీచర్లు ఉంటాయి. 100కుపైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

నాయిస్‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్‍ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని నాయిస్ వెల్లడించింది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ వాచ్‍లోనే నోటిఫికేషన్లను పొందవచ్చు. అలారమ్, క్యాలెండర్, క్యాలుకులేటర్ లాంటి ఫీచర్లు ఈ వాచ్‍లో ఉంటాయి.

నాయిస్‍‍ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ ధర

NoiseFit Crew Smartwatch Price: నాయిస్ ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,499గా ఉంది. బ్లాక్, బ్లూ, గ్రే, గ్రీన్, పింక్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart), నాయిస్ వెబ్‍సైట్ (gonoise.com)లో అతిత్వరలో ఈ వాచ్ సేల్‍కు అందుబాటులోకి రానుంది.

నాయిస్ నుంచి ఇటీవల డిఫరెంట్ డిజైన్‍తో నాయిస్‍ఫిట్ ఫోర్స్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. రగెడ్ డిజైన్‍తో స్పోర్టీ లుక్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ ఉంటుంది. ఈ వాచ్ ధర రూ.2,499గా ఉంది. అమెజాన్‍లో ఈ వాచ్ అందుబాటులో ఉంది.