తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartwatch: ఆకర్షణీయమైన డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్‍తో బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్: బడ్జెట్ ధరలో..

Smartwatch: ఆకర్షణీయమైన డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్‍తో బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్: బడ్జెట్ ధరలో..

16 February 2023, 17:19 IST

    • Boult Swing Smartwatch: బ్లూటూత్ కాలింగ్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే డిస్‍ప్లేతో బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ సేల్ కూడా మొదలైంది.
Smartwatch: బ్లూటూత్ కాలింగ్‍తో బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ (Photo: Boult Audio)
Smartwatch: బ్లూటూత్ కాలింగ్‍తో బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ (Photo: Boult Audio)

Smartwatch: బ్లూటూత్ కాలింగ్‍తో బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ (Photo: Boult Audio)

Boult Swing Smartwatch: బోల్ట్ ఆడియో బ్రాండ్ భారత మార్కెట్‍‍లోకి కొత్త స్మార్ట్‌వాచ్‍ (New Smartwatch)ను తీసుకొచ్చింది. బోల్ట్ స్వింగ్ (Boult Swing) పేరుతో ఇది లాంచ్ అయింది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే డిస్‍ప్లేతో బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. అంటే ఈ వాచ్ గరిష్ఠ బ్రైట్‍నెస్ ఎక్కువగా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ వాచ్ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. Boult Swing స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

Boult Swing Smartwatch: ధర, సేల్

బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,799గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్(Flipkart)లో ఈ వాచ్ సేల్‍కు వచ్చింది. బ్లూ, బ్లాక్, బీక్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.

Boult Swing Smartwatch: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

1.9 ఇంచుల హెచ్‍డీ స్క్వేర్ షేప్ డి‍స్‍ప్లేతో బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. గరిష్ఠంగా 1000 నిట్స్ వరకు బ్రైట్‍నెస్‍కు సపోర్ట్ చేస్తుంది. డిస్‍ప్లే ఈ వాచ్‍కు హైలైట్‍గా ఉంది. 150కు పైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. ఇక బ్లూటూత్ కాలింగ్ కోసం ఈ వాచ్‍లో స్పీకర్, మైక్ ఉంటాయి. బ్లూటూత్‍తో ఫోన్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్‍లోనే పొందవచ్చు.

Boult Swing Smartwatchను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని Boult వెల్లడించింది. బ్లూటూత్ కాలింగ్‍ కోసం వాడితే కాస్త తక్కువే రావొచ్చు. 2 గంటల్లోగా ఈ వాచ్ ఫుల్ చార్జ్ అవుతుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1 వెర్షన్‍ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ67 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.

హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ మానిటరింగ్, బ్లడ్ ప్లజర్ మానిటరింగ్ హెల్త్ ఫీచర్లను Boult Swing స్మార్ట్‌వాచ్ కలిగిఉంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

తదుపరి వ్యాసం