తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Smartwatch: పెద్ద సైజ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. తక్కువ ధరకే!

New Smartwatch: పెద్ద సైజ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. తక్కువ ధరకే!

14 February 2023, 11:00 IST

    • Ambrane Wise Eon Max Smartwatch: ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ మ్యాక్స్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. బడ్జెట్ రేంజ్‍లో ప్రత్యేక లాంచ్ ఆఫర్ ధరకు సేల్‍కు అందుబాటులో ఉంది.
New Smartwatch: పెద్ద సైజ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్.. తక్కువ ధరకే! (Photo: Ambrane)
New Smartwatch: పెద్ద సైజ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్.. తక్కువ ధరకే! (Photo: Ambrane)

New Smartwatch: పెద్ద సైజ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్.. తక్కువ ధరకే! (Photo: Ambrane)

Ambrane Wise Eon Max Smartwatch: కాస్త పెద్ద సైజ్ డిస్‍ప్లేతో స్మార్ట్‌వాచ్ కావాలనుకునే వారి కోసం ఓ మోడల్ అందుబాటులోకి వచ్చింది. దేశీయ కంపెనీ ఆంబ్రేన్ (Ambrane) కొత్తగా మరో స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది. ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ మ్యాక్స్ (Ambrane Wise Eon Max) పేరుతో ఈ వాచ్.. భారత మార్కెట్‍లోకి వచ్చింది. ఇప్పటికే సేల్‍ కూడా మొదలైంది. లాంచ్ ఆఫర్ కింద ప్రత్యేక ధరతో లభిస్తోంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కూడా ఈ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ మ్యాక్స్ వాచ్ పూర్తి వివరాలు ఇవే.

ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ మ్యాక్స్ ధర, సేల్

Ambrane Wise Eon Max Smartwatch: ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ మ్యాక్స్ స్మార్ట్‌వాచ్ ధర ప్రస్తుతం రూ.1,799గా ఉంది. ఇది లాంచ్ ఆఫర్ కింద ప్రత్యేక ధర అని ఆంబ్రేన్ పేర్కొంది. అయితే ఈ ప్రత్యేక ధర ఎంత కాలం ఉంటుందో లాస్ట్ డేట్‍ను చెప్పలేదు. ప్రస్తుతం రూ.1,799 ధరకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ స్మార్ట్‌వాచ్ సేల్‍కు ఉంది. బ్లాక్, బ్లూ, గ్రే, బ్రౌన్, బర్గండీ కలర్ ఆప్షన్‍లలో ఈ ఆంబ్రేన్ వాచ్ లభిస్తోంది.

Ambrane Wise Eon Max Smartwatch: స్పెసిఫికేషన్లు

240x283 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 2.01 ఇంచుల లుసిడ్ డిస్‍ప్లేను ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ మ్యాక్స్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 55 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయి. కస్టమైజ్ చేసుకునే వీలుండే 100కు పైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ కోసం ఈ వాచ్‍లో ఇన్‍బుల్ట్‌గా స్పీకర్, మైక్రో ఫోన్ ఉంటాయి. మొబైల్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్‍లో పొందవచ్చు.

హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్‌ను కొలిచే SpO2 మానిటరింగ్ హెల్త్ ఫీచర్లతో Ambrane Wise Eon Max వస్తోంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. మూడు స్మాల్ ఇన్‍బుల్ట్ గేమ్స్ కూడా ఉంటాయి.

ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ మ్యాక్స్ స్మార్ట్‌వాచ్‍లో 280mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్‌పై 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఆంబ్రేన్ పేర్కొంది. అయితే బ్లూటూత్ కాలింగ్ కోసం వినియోగిస్తే బ్యాటరీ లైఫ్ కాస్త తక్కువ రావొచ్చు. వాయిస్ అసిస్టెంట్స్‌కు కూడా ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ నయా ఆంబ్రేన్ వాచ్ కలిగి ఉంది.

తదుపరి వ్యాసం