Smartwatch: రగెడ్ డిజైన్‍తో నాయిస్ నుంచి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్లు ఇవే
22 February 2023, 13:31 IST
- NoiseFit Force smartwatch: నాయిస్‍ఫిట్ ఫోర్స్ స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. రఫ్ డిజైన్, బ్లూటూత్ కాలింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.
Smartwatch: రగెడ్ లుక్‍తో నాయిస్ నుంచి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo )
Smartwatch: రగెడ్ లుక్‍తో నాయిస్ నుంచి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo )
NoiseFit Force smartwatch దేశీయ కంపెనీ నాయిస్ (Noise) నుంచి రఫ్‍గా కనిపించే రగెడ్ (Rugged) లుక్‍తో కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. నాయిస్‍ఫిట్ ఫోర్స్ పేరుతో ఈ వాచ్ అడుగుపెట్టింది. బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో ఈ వాచ్ వస్తోంది. 150 వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. మూడు కలర్ ఆప్షన్‍లలో.. బడ్జెట్ ధరతో ఈ వాచ్ లభించనుంది. నాయిస్‍ఫిట్ ఫోర్స్ రగెడ్ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.
నాయిస్‍ఫిట్ ఫోర్స్ స్మార్ట్‌వాచ్ ధర, సేల్
NoiseFit Force Smartwatch Price: నాయిస్‍ఫిట్ ఫోర్స్ స్మార్ట్‌వాచ్ ధర రూ.2,499గా ఉంది. ఫిబ్రవరి 3వ తేదీన ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon), నాయిస్‍ఫిట్ వెబ్‍సైట్‍లో ఈ వాచ్ సేల్‍కు వస్తుంది. జెట్ బ్లాక్, టీల్ గ్రీన్, మిస్టీ గ్రే కలర్లలో అందుబాటులోకి రానుంది.
నాయిస్‍ఫిట్ ఫోర్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
- NoiseFit Force Smartwatch Specifications: నాయిస్‍ఫిట్ ఫోర్స్ స్మార్ట్‌వాచ్ 1.32 ఇంచుల రౌండ్ షేప్డ్ డిస్‍ప్లేను కలిగి ఉంది. 360x360 పిక్సెల్స్ రెజల్యూషన్, 550 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. 150 వాచ్ ఫేసెస్‍తో వస్తోంది.
- బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో నాయిస్‍ఫిట్ ఫోర్స్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. దీంతో మొబైల్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్‍లోనే కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ చేయవచ్చు. కాల్ లాగ్స్, డయల్ ప్యాడ్ సదుపాయం కూడా ఈ వాచ్‍లో ఉంటుంది.
- NoiseFit Force Smartwatch: స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్ హెల్త్ ఫీచర్లతో నాయిస్‍ఫిట్ ఫోర్స్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ లాంటి విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. బాడీ దృఢంగా ఉండేలా రగెడ్ డిజైన్‍తో ఈ వాచ్‍ను తీసుకొచ్చినట్టు నాయిస్ పేర్కొంది.
- NoiseFit Force Smartwatch: ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ స్మార్ట్‌వాచ్ ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని నాయిస్ వెల్లడించింది. వాయిస్ అసిస్టెంట్‍కు కూడా నాయిస్‍ఫిట్ ఫోర్స్ వాచ్ సపోర్ట్ చేస్తుందని పేర్కొంది.