తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartwatches: బ్లూటూత్ కాలింగ్‍తో డిజో నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‍లు.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Smartwatches: బ్లూటూత్ కాలింగ్‍తో డిజో నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‍లు.. ధరలు ఎలా ఉన్నాయంటే..

11 January 2023, 17:44 IST

    • Dizo Watch D Series Smartwatches: రియల్‍‍మీ టెక్‍లైఫ్ పరిధిలోని డిజో బ్రాండ్ కొత్తగా రెండు స్మార్ట్‌వాచ్‍లను తీసుకొచ్చింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఇవి వస్తున్నాయి. వీటి ధరలు, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలపై ఓ లుక్కేయండి.
Smartwatches: బ్లూటూత్ కాలింగ్‍తో డిజో నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‍లు (Photo: Dizo)
Smartwatches: బ్లూటూత్ కాలింగ్‍తో డిజో నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‍లు (Photo: Dizo)

Smartwatches: బ్లూటూత్ కాలింగ్‍తో డిజో నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‍లు (Photo: Dizo)

Dizo Watch D Pro, Dizo Watch D Ultra: డిజో వాచ్ డీ ప్రో, డిజో వాచ్ డీ అల్ట్రా స్మార్ట్‌వాచ్‍లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. రియల్‍మీ టెక్ లైఫ్ (Realme TechLife) బ్రాండ్ డిజో ఈ కొత్త లైనప్ వాచ్‍ను విడుదల చేసింది. డిజో డీ1 ప్రాసెసర్‌పై ప్రో మోడల్ రన్ అవుతుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఈ రెండు స్మార్ట్‌వాచ్‍లు కలిగి ఉన్నాయి. దీంతో ఫోన్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్‍ ద్వారానే కాల్స్ చేసుకోవచ్చు. కాల్స్ మాట్లాడవచ్చు. ఇందుకోసం ఇన్‍బుల్ట్ గా స్పీకర్, మైక్రోఫోన్ ఉంటాయి. డిజో వాచ్ డీ ప్రో, డిజో వాచ్ డీ అల్ట్రా పూర్తి వివరాలు ఇవే.

డిజో వాచ్ డీ అల్ట్రా ధర, సేల్

Dizo Watch D Ultra Price: డిజో వాచ్ డీ అల్ట్రా ధర రూ.3,299గా ఉంది. ఈ వాచ్ ఈ నెల 12వ తేదీన ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో సేల్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూ, బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్‍లలో లభ్యం కానుంది.

డిజో వాచ్ డీ ప్రో ధర, సేల్

Dizo Watch D Pro Price: డిజో వాచ్ డీ ప్రో ధర రూ.2,699గా ఉంది. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లో సేల్‍కు వస్తుంది. బ్లూ, బ్లాక్, గ్రే స్ట్రాప్స్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది.

డిజో వాచ్ డీ ప్రో, వాచ్ డీ అల్ట్రా స్పెసిఫికేషన్లు

Dizo Watch D Pro Specifications: 1.85 ఇంచుల డిస్‍ప్లేను డిజో వాచ్ డీ ప్రో కలిగి ఉంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. డిజో డీ1 ప్రాసెసర్, డిజో ఓఎస్‍పై రన్ అవుతుంది. 150 వరకు వాచ్‍ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

110 స్పోర్ట్ మోడ్‍లకు ఈ డిజో వాచ్ డీ ప్రో స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 ట్రాకర్, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లతో ఈ వాచ్ వస్తోంది. ఈ వాచ్ ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని డిజో పేర్కొంది.

ఇక, డిజో వాచ్ డీ అల్ట్రా (Dizo Watch D Ultra) కూడా ఇవే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. అయితే డిస్‍ప్లే మరింత మెరుగ్గా ఉంది. 1.78 ఇంచుల అమోలెడ్ డిస్‍ప్లేతో అల్ట్రా మోడల్ వస్తోంది. ఈ వాచ్‍లో డిజో డీ1 కాకుండా వేరే ప్రాసెసర్‌ను డిజో ఇచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే డిజో వాచ్ డీ అల్ట్రా స్మార్ట్‌వాచ్ 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఆ కంపెనీ చెబుతోంది. అయితే, బ్లూటూత్ కాలింగ్ కోసం వినియోగిస్తే బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవి మినహా డీ ప్రో స్పెసిఫికేషన్లే అల్ట్రా వాచ్‍లోనూ ఉంటాయి.

టాపిక్