Noise ColorFit Pro 4 GPS: బుల్ట్ఇన్ జీపీఎస్‍, బ్లూటూత్ కాలింగ్‍తో బడ్జెట్ రేంజ్‍లో నాయిస్ నయా స్మార్ట్‌వాచ్ లాంచ్-noise colorfit pro 4 gps launched in india with bluetooth calling feature check price specifications features and more details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Noise Colorfit Pro 4 Gps Launched In India With Bluetooth Calling Feature Check Price Specifications Features And More Details

Noise ColorFit Pro 4 GPS: బుల్ట్ఇన్ జీపీఎస్‍, బ్లూటూత్ కాలింగ్‍తో బడ్జెట్ రేంజ్‍లో నాయిస్ నయా స్మార్ట్‌వాచ్ లాంచ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 17, 2023 10:09 AM IST

Noise ColorFit Pro 4 GPS Smartwatch: నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 జీపీఎస్ స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. బ్లూటూత్ కాలింగ్, ఇన్‍బుల్ట్ జీపీఎస్‍, బ్లూటూత్ 5.3 వెర్షన్ కనెక్టివిటీని ఈ వాచ్ కలిగి ఉంది. రూ.3వేలలోపు ధరతోనే ఈ వాచ్ వస్తోంది.

Noise ColorFit Pro 4 GPS: బుల్ట్ఇన్ జీపీఎస్‍, బ్లూటూత్ కాలింగ్‍తో బడ్జెట్ రేంజ్‍లో నాయిస్ నయా స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Noise)
Noise ColorFit Pro 4 GPS: బుల్ట్ఇన్ జీపీఎస్‍, బ్లూటూత్ కాలింగ్‍తో బడ్జెట్ రేంజ్‍లో నాయిస్ నయా స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Noise)

Noise ColorFit Pro 4 GPS Smartwatch: దేశీయ సంస్థ నాయిస్ (Noise) బడ్జెట్ రేంజ్‍లో మంచి ఫీచర్లతో కొత్త స్మార్ట్‌వాచ్‍ను మార్కెట్‍‍లోకి తీసుకొచ్చింది. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 జీపీఎస్ పేరుతో ఈ వాచ్ లాంచ్ అయింది. బడ్జెట్ రేంజ్‍లో ఇన్‍బుల్ట్ జీపీఎస్ ఉండడం ఈ వాచ్ ప్రత్యేకతగా ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే డిస్‍ప్లేతో ఈ నయా స్మార్ట్‌వాచ్ వస్తోంది. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 జీపీఎస్ వాచ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు మరిన్ని వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 జీపీఎస్ ధర, సేల్

Noise ColorFit Pro 4 GPS Price in India: నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 జీపీఎస్ స్మార్ట్‌వాచ్ ధర రూ.2,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍తో పాటు నాయిస్ కంపెనీ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ సేల్ మొదలైంది. సిల్వర్ గ్రే, చార్కోల్ బ్లాక్, టీల్ బ్లూ, మిడ్‍నైట్ బ్లూ, సన్‍సెట్ ఆరెంజ్, మింట్ గ్రీన్, డీప్ వైన్, రోజ్ పింక్ కలర్లలో ఈ వాచ్ లభిస్తోంది.

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 జీపీఎస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Noise ColorFit Pro 4 GPS Specifications: 1.85 ఇంచుల TFT స్క్వేర్ డిస్‍ప్లేను నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 జీపీఎస్ వాచ్ కలిగి ఉంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. బ్లూటూత్ 5.3 వెర్షన్‍తో ఈ వాచ్ వస్తోంది. బ్లూటూత్ కాలింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. అంటే ఫోన్‍కు కనెక్ట్ చేసినప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ చేయవచ్చు. ఇక ఈ వాచ్‍లో ఇన్‍బుల్ట్‌గా జీపీఎస్ ఉంటుంది. దీనివల్ల ఫిట్‍నెస్ ట్రాకింగ్‍కు జీపీఎస్ కోసం స్మార్ట్ ఫోన్‍పై ఆధారపడాల్సిన అవసరం లేదు.

ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 జీపీఎస్ వాచ్ ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని నాయిస్ పేర్కొంది. అయితే బ్లూటూత్ కాలింగ్, జీపీఎస్‍తో వినియోగిస్తే బ్యాటరీ లైఫ్ తక్కువగానే వస్తుంది.

హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్ లాంటి హెల్త్ ఫీచర్లు Noise ColorFit Pro 4 GPS వాచ్‍లో ఉంటాయి. 100 స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. 150కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్