Smartwatch: స్టీల్ స్ట్రాప్స్, ఇంటర్నల్ స్టోరేజ్‍తో ఫైర్ బోల్ట్ నుంచి డిఫరెంట్ స్మార్ట్‌వాచ్: ధర ఎంతంటే!-fire boltt quantum smartwatch launched with steel straps for 2999 rupees check specifications features details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Fire Boltt Quantum Smartwatch Launched With Steel Straps For 2999 Rupees Check Specifications Features Details

Smartwatch: స్టీల్ స్ట్రాప్స్, ఇంటర్నల్ స్టోరేజ్‍తో ఫైర్ బోల్ట్ నుంచి డిఫరెంట్ స్మార్ట్‌వాచ్: ధర ఎంతంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 14, 2023 04:19 PM IST

Fire-Boltt Quantum Smartwatch: స్ట్రీల్ స్ట్రాప్స్, డిఫరెంట్ లుక్‍తో ఫైర్ బోల్ట్ క్వాంటమ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. ఇంటర్నల్ స్టోరేజ్, టీడబ్ల్యూఎస్‍కు కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉండడం కూడా హైలైట్‍గా ఉంది.

Smartwatch: స్టీల్ స్ట్రాప్స్, ఇంటర్నల్ స్టోరేజ్‍తో ఫైర్ బోల్ట్ నుంచి డిఫరెంట్ స్మార్ట్‌వాచ్ (Photo: Fire-Boltt)
Smartwatch: స్టీల్ స్ట్రాప్స్, ఇంటర్నల్ స్టోరేజ్‍తో ఫైర్ బోల్ట్ నుంచి డిఫరెంట్ స్మార్ట్‌వాచ్ (Photo: Fire-Boltt)

Fire-Boltt Quantum Smartwatch: దేశీయ కంపెనీ ఫైర్ బోల్ట్ (Fire-Boltt) స్మార్ట్‌వాచ్‍ల విషయంలో దూకుడు కొనసాగిస్తోంది. వరుసగా మోడళ్లను మార్కెట్‍లోకి తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఫైర్ బోల్ట్ క్వాంటమ్ (Fire-Boltt Quantum) వాచ్‍ను తాజాగా లాంచ్ చేసింది. స్టీల్ స్ట్రాప్‍లతో చూసేందుకు ఈ వాచ్ డిఫరెంట్ క్లాసిక్ లుక్‍ను ఇస్తుంది. మెటల్ ఫ్రేమ్, సెరామిక్ బాడీని ఈ వాచ్ కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ కూడా ఉంటుంది. 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండడం ఈ ఫైర్ బోల్ట్ క్వాంటమ్ స్మార్ట్‌వాచ్‍కు మరో హైలైట్‍గా ఉంది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

ఫైర్ బోల్ట్ క్వాంటమ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Fire-Boltt Quantum Specifications: స్టెయిన్‍లెస్ స్టీల్ స్ట్రాప్స్, స్టీల్ డయల్‍తో ఫైర్ బోల్ట్ క్వాంటమ్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. 1.28 హెచ్‍డీ రౌండ్ షేప్ డిస్‍ప్లే ఉంటుంది. ఈ వాచ్‍లో 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీంతో ఈ వాచ్‍లో కొన్ని పాటలను స్టోర్ చేసుకోవచ్చు. టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‍లను వాచ్‍కు కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినవచ్చు.

Fire-Boltt Quantum Smartwatch: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఈ ఫైర్ బోల్ట్ క్వాంటమ్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. ఇందుకోసం ఈ వాచ్‍లో స్పీకర్, మైక్రోఫోన్ ఉంటాయి. మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ నుంచి కాల్స్ మాట్లాడవచ్చు. హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 ట్రాకర్, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లను ఈ ఫైర్ బోల్ట్ నయా వాచ్ కలిగి ఉంది. రన్నింగ్, థ్రెడ్‍మిల్, వాకింగ్, క్రికెట్ లాంటి విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ ఉంటుంది. ఎంత దూరం కవర్ చేశారు, ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయన్న సమాచారాన్ని కూడా ఈ వాచ్ రికార్డ్ చేసుకుంటుంది.

Fire-Boltt Quantum Smartwatch: ఫైర్ బోల్ట్ క్వాంటమ్ స్మార్ట్‌వాచ్‍లో 350mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల వరకు వాడుకోవచ్చు. అయితే బ్లూటూత్ కాలింగ్‍తో వాడితే 2 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని ఫైర్ బోల్ట్ పేర్కొంది. వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ67 రేటింగ్ ఉంటుంది .

పైర్ బోల్ట్ క్వాంటమ్ ధర, సేల్

Fire-Boltt Quantum Smartwatch Price, Sale: ఫైర్ బోల్ట్ క్వాంటమ్ స్మార్ట్‌వాచ్ ధర రూ.2,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍తో పాటు ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ సేల్ మొదలైంది.

WhatsApp channel

సంబంధిత కథనం